తొడ కొట్టి, మీసం తిప్పి రికార్డులు కొట్టాడు.. ఫ్యాక్షన్ అనగానే గుర్తొచ్చే సూపర్ హిట్ బొమ్మలు ఇవే..!

shami

తెలుగు తెర మీద ఫ్యాక్షన్ కథలు చాలానే వచ్చాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతోనే వరుస సినిమాలు వచ్చేవి. ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన తొడకొడితే రికార్డుల మోత మోగాల్సిందే. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో సూపర్ హిట్లు గా నిలిచినా సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు రెండు సినిమాలు ఆయన కెరియర్ లో బెస్ట్ హిట్లు గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంతో వచ్చినవే. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఈ రెండు సినిమాలు డైరెక్ట్ చేసింది కూడా ఒకే దర్శకుడు ఆయనే బి.గోపాల్. 

 

ఫ్యాక్షన్ సినిమా అనగానే గుర్తొచ్చే సినిమాల్లో సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఉంటాయి. బాలయ్య స్టామినా ఏంటో చూపించిన సినిమాలు ఇవి. అప్పటివరకు ఫ్యామిలీ, ఎమోషనల్ సినిమాలు చేసిన ఆయన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో చేసిన ఈ సినిమాలు దుమ్ముదులిపేలా వసూళ్లు రాబట్టాయి. కొంతకాలం వరకు బాలకృష్ణ ఇదే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతో ట్రెండ్ కొనసాగించాడు. అయితే ఆడియెన్స్ కు అవి బోర్ కొట్టడంతో మంచి ఫలితాలు అందించలేదు.

 

అయినా సరే అప్పటికి ఇప్పటికి ఫ్యాక్షన్ సినిమా అనగానే బాలయ్య బాబే గుర్తుకొస్తారు.నందమూరి బాలకృష్ణ ఇమేజ్ రెట్టింపు అయ్యేలా ఫ్యాక్షన్ సినిమాలు బాగా తోడ్పడ్డాయి. కొన్నాళ్ళు బాలకృష్ణ ఇదే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతో అదరగొట్టారు. ఇక ఇలాంటి సినిమాల్లో బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా అనిపిస్తాయి. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా.. అని చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో కొన్నాళ్లుగా ప్రేక్షకుల మైండ్ లో ఆలా ఉండిపోయింది. మళ్ళీ బాలకృష్ణ అలంటి ఫ్యాక్షన్ కథలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది ఏ డైరక్టర్ సారధ్యంలో జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: