చిన్న హీరోల వెంట నిర్మాతలు

Gullapally Rajesh

అగ్ర హీరోల సినిమాలు అనగానే దర్శక నిర్మాతలకు ముందు నుంచి ఒక ఆసక్తి ఉంటుంది. కాని కరోనా దెబ్బకు ఇప్పుడు దర్శక నిర్మాతలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో అర్ధం కాక చాలా మంది దర్శక నిర్మాతలు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. టాలీవుడ్ లో చాలా మంది హీరోల సినిమాలు ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడు దర్శక నిర్మాతలకు ఏర్పడింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

 

ఈ ఏడాది ఏ ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం లేదని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వచ్చే ఏడాది సినిమాలు అన్నీ కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు ఇప్పుడు ఈ ఏడాది మీశ దాదాపుగా ఆశలు వదిలేసారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మన తెలుగు సినిమాకు మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా కఠిన పరిస్థితులు ఉన్న నేపధ్యంలో చాలా మంది దర్శక నిర్మాతలు పెద్ద హీరోల సినిమాలు వద్దని చిన్న హీరోలతో సినిమా చేస్తే మంచిది అనే భావన లో ఉన్నారని టాలీవుడ్ జనం అంటున్నారు. అగ్ర హీర్ల సినిమాల మీద దాదాపుగా ఆశలు వదులుకుంది టాలీవుడ్. 

 

ప్రస్తుతం మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు అందరూ కూడా వడ్డీలు తీసుకునే పరిస్థితి వచ్చింది. దీనితో తాము భారీగా నష్టపోతున్నాం అనే భావన లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వద్దు అని అనుకున్నారని సమాచారం. ఒక రెండేళ్ళ పాటు తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తే బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: