హిట్ ఫార్మలా కోసం అన్వేషణ

  ఆల్ ది బెస్ట్ చిత్రంతో జెడి చక్రవర్తి తన పంథాను మార్చుకుని కమర్షిల్ ఫార్మలాతో హాస్యాన్ని జోడించి దర్శకత్వం వహించారు. నటుడుగా, హీరోగా నే కాక ధర్శకత్వం శాఖలో కూడ పని చేసిన జెడి, నల్లేరు మీద నడకలా దర్శకుడుగా తన ప్రతిభ కనపర్చుతున్నారు జెడి.  యువ విలన్ గా శివ చిత్రంతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి, రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా తెలుగు,హింది, చిత్రాల్లో నటించారు. వన్ బై టు,ఎగిరే పావురమా సినిమాలో శ్రీకాంత్ తో కలసి నటించిన జెడి ఇప్పడు ఆదే సెంటిమెంట్ తో శ్రీకాంత్ తో జత కట్టి ఆల్ ది బెస్ట్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంతో తెర కెక్కించారు.  దర్శకుడిగా హోమం,సిద్దమ్, మనీ మోర్ మనీ సినిమాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదనే చేప్పాలి. చక్రవర్తి దర్శకత్వం వహించిన చిత్రాల్లో బారీ బడ్జెట్ సినిమా ఇది. గతంలో లోబడ్జేట్ చిత్రాలనే దర్శకత్వం చేశారు. ఈ చిత్రమైనా దర్శకుడిగా జెడికి మంచి మార్క్ లే పడాలనీ కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: