RRR: చరణ్ పాత్రపై అంచనాలు పెంచేస్తున్న ట్వీట్

Murali

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రీసెంట్ గా విడుదలైన మోషన్ పోస్టర్ లో టైటిల్ ను ‘రౌద్రం రణం రుధిరం’ గా ప్రకటించారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పుడీ సినిమా టైటిల్ తోపాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయడంతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం సినీ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈలోపు మరో అప్డేట్ సంచలనం రేపుతోంది.

 

రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ బాక్సింగ్ కు సంబంధించిన ఫైట్ ఉంటుందని సమాచారం. బాక్సింగ్ లో చరణ్ కు మెళకువలు నేర్పించేందుకు భారత బాక్సర్, మాజీ ఛాంపియన్ నీరజ్ గోయత్ తో శిక్షణ ఇప్పించారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చరణ్ తో దిగిన ఫోటోను నీరజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ లో బాక్సింగ్ చేసి అలసినట్టు కనిపిస్తున్నారు. ఈ పిక్ తో సినిమాపై, చరణ్ పాత్రపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ తో అని నీరజ్ తన వాల్ లో రాసుకున్నాడు.

 

 

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రీసెంట్ గా రివీల్ చేసిన చరణ్ కు సంబంధించిన వీడియో రామ్ చరణ్ పోలిస్ పాత్రతో పాటు బాక్సర్ గా కనిపించాడు. ఫుల్ బాడీ ఫిట్ నెస్ తో ఉన్న రామ్ చరణ్ బాక్సింగ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి రానున్న రోజుల్లో మరెన్ని అప్డేట్స్ వస్తాయో.. ఈ సిమాపై మరెన్ని అంచనాలు పెరిగిపోతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: