తెరపై ఆమె కనిపిస్తే.. నవ్వులే నవ్వులు..!
పాత తరం కమెడియన్లు అంటె వెంటనే గుర్తుకు వచ్చేది రేలంగి, రాజబాబు, పద్మానాభం, రమణారెడ్డి, చలం. ఇక లేడీ కమెడియన్లలో రమాప్రభ, గీతాంజలి చెబుతారు. నటి నటీమణులలో చెప్పుకోదగ్గ హిట్ కాంబినేషన్ మన రమాప్రభ - రాజీబాబులదే. రమాప్రభ, రాజీబాబు. నవ్వు...నవ్వించు...నవ్వులు నలుగురికి పంచు...అనే సిద్ధాంతాన్నే జీవితంగా మలచుకున్న హాస్య నటులు ఇద్దరు. రమాప్రభ 1946, మే 5 న అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించింది. రమాప్రభ కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా పుట్టింది. ఇండస్ట్రీకి రాకముందు.. రమాప్రభ నాటకాలలో నటించారు. నటన అంటే రమాప్రభకు ఎంతో ఇష్టం. ఎంత పెద్ద డైలాగు చెప్పినా రమాప్రభ ఎంతో సులభంగా చెప్పేవారు. రమాప్రభ షూటింగ్ టైంలో తోటి నటీనటులతో సరదాగా ఉండేవారు.
సరదాగా, జాలీగా అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడడం రమాప్రభకు అలవాటు. దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు చిత్రాల్లో నటించింది. తండ్రి కృష్ణదాస్ ముఖర్జీ గూడూరులో మైకా వ్యాపారం చేశారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో చిత్రాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. ప్రముఖ నటుడు శరత్ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. ఇండస్ట్రీకి రాకముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు. రమాప్రభ నెలరోజుల పసికందుగా ఉన్నప్పుడు మాకిచ్చేయరాదా పెంచుకుంటాము అని మేనత్త మేనమామ అడగగా, తల్లిదండ్రులు దత్తత ఇచ్చేశారు. మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ అబ్రకం గనుల్లో పని చేసేవాడు.
రమాప్రభ బాల్యం కదిరిలో కొంతకాలం ఆ తర్వాత ఊటి సమీపంలోని లోయలో సాగింది. ఒక్కగానొక్క పెంపుడు కూతురు కాబట్టి తనను గారాభంగా పెంచారు. కానీ రమాప్రభకు పన్నెండేళ్లు వచ్చేసరికి పెంపుడుతండ్రి చనిపోయాడు. ఆ తర్వాత ఆమెతల్లితో మద్రాస్ కి వచ్చిన చిన్న చిన్న పనులు చేస్తూ బతికారు.. అనుకోకుండా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడంతో వారి జాతకం పూర్తిగా మారిపోయింది. అయితే రీల్ లైఫ్ లో కోట్ల మందిని నవ్వించిన రమాప్రభ రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలు పడ్డట్టు చెతుంది. తాను ఎంతో మందిని నమ్మానని.. చాలా మంది దారుణంగా మోసం చేశారని పలు ఇంటర్వ్యూల్లో చెప్పి బాధపడింది.