ఒక్కతాటిపై వస్తున్న టాలీవుడ్.. కంపు కంపు చేసుకున్న గాసిప్ మీడియా..?
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న గా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఓ గాసిప్ మీడియా విజయ్ దేవరకొండ పై తప్పుడు ప్రచారం చేసింది అంటూ విజయ్ దేవరకొండ ఏకంగా 20 నిమిషాల పాటు ఓ వీడియో ద్వారా ఆ మీడియా ని ఏకి పారేశారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఇంత దారుణంగా నా మీద వార్తలు రాస్తారా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా మమ్మల్ని వాడుకొని మామీద బతుకుతూ మళ్ళీ మా మీదనే చెడ్డ వార్తలు రాస్తారా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఇక తాజాగా విజయ్ దేవరకొండ మాటలకే ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలుపుతూ గాసిప్ మీడియా కి చుక్కలు చూపిస్తున్నారు.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులందరూ విజయ్ దేవరకొండ కు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖులు అందరూ ఏకమై ఒక్కతాటిపైకి వస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు మద్దతుగా ప్రముఖ డైరెక్టర్ లు హీరోలు అందరూ జై కొడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి వీళ్ళందరూ ప్రస్తుతం విజయ్ దేవరకొండ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం దేవరకొండ కు మద్దతు తెలుపుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డియర్ విజయ్ దేవరకొండ మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలనుm బాధ్యతలేని రాతల వల్ల నేను నా కుటుంబం ఎన్నోసార్లు బాధ పడ్డాము. నేను మీకు తోడుగా అండగా ఉంటాను మీరు పేదలకు సహాయం చేయడానికి ఎంతో మానవతా దృక్పథంతో ముందుకు సాగారు అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్టు పెట్టారు.
ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు 🙏🏽
YOU INVESTED YOUR TIME MONEY AND EFFORT TO MAKE THIS HAPPEN. WE RESPECT YOU FOR THAT. BUT UNFORTUNATELY WE ARE IN A war ZONE. AND WE HAVE TO FIGHT BACK. YOU ARE MY FIGHTER💪🏽 WE SUPPORT YOU MAN @TheDeverakonda #KillFakeNews — PURIJAGAN (@purijagan) May 5, 2020🙏🙏🙏🙏 https://t.co/Fe5XsuF8L5 — harish shankar .S (@harish2you) May 5, 2020
ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ కు మద్దతుగా ఓ పోస్ట్ పెట్టారు. ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టావు.. నీ డబ్బులతో ఎంతో కస్టపడి పేదలకు సహాయం చేశావు. దానికి మేము నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాం. కానీ కొన్ని రాతల వల్ల మేం కూడా బాధ పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.. నేనెప్పుడూ నీతోనే ఉంటాను అంటూ పూరి జగన్నాథ్ కూడా ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ కి మద్దతు తెలిపారు. అటు మరో దర్శకుడు హరీష్ శంకర్ కూడా విజయ్ దేవరకొండ కు మద్దతు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా తన మద్దతును తెలియజేశారు. ఏదేమైనా ఆ గాసిప్ వెబ్సైట్ పూర్తిగా కంపు కంపు చేసుకుంది అని విశ్లేషకులు అంటున్నారు.
డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews — chiranjeevi konidela (@KChiruTweets) May 5, 2020