టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ హీరోయిన్ అనుష్క..!
సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస స్టార్ సినిమాలతో సత్తా చాటిన ఈ అమ్మడు ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. టాలీవుడ్ లో నేటితరం ఏ హీరోయిన్ కూడా చేయలేని సాహసాలను అనుష్క చేసింది. అరుంధతి సినిమా అనుష్క కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమా కథ వస్తే అది కచ్చితంగా అనుష్క చేయాల్సిందే అన్న రేంజ్ లో ఆమె క్రేజ్ తెచ్చుకుంది. అరుంధతి తర్వాత రుద్రమదేవి సినిమా కూడా అనుష్క కెరియర్ లో మరో క్రేజీ మూవీ అని చెప్పొచ్చు. గుణశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాతో కూడా సత్తా చాటింది అనుష్క. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సత్తా చాటింది అనుష్క. అందుకే అనుష్కని తెలుగులో లేడీ సూపర్ స్టార్ అంటుంటారు.
ట్రెండ్ కు తగినట్టుగా సినిమాలు తీయడం అందరు చేసే పని.. కానీ ట్రెండ్ మార్చే సినిమాల్లో నటించాలని అనుకోవడం మాత్రం అనుష్క వల్లే సాధ్యమైంది. తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలు అవి రాబట్టే వసూళ్లు దాదాపు స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కానీ ఇమేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. అనుష్క చేస్తున్న ఈ కొత్త ప్రయోగాలు ఎప్పటికి కొనసాగాలని కోరుకుందాం. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమా రిలీజ్ కు రెడీ అవగా ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కే పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్క ఫిమేల్ లీడ్ గా నటిస్తుందని టాక్. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది.