బావకు ఉహించని ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య !

Seetha Sailaja
ఈమధ్యన పాయకరావు పేటలో బాలయ్య ఫ్యాన్స్‌తో సమావేశమైన రాష్ర్ట అధ్యక్షుడు సీహెచ్.రమేష్ టీడీపీలో బాలయ్యకు సముచిత స్థానం ఇవ్వలేదని, నందమూరి వారసులకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి తీరాలని, పార్టీకి బాలయ్యను అధ్యక్షుడు చేయాల్సిందేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.ఈ వ్యాఖలు బాలయ్యే పరోక్షంగా చేయించారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో పాటు బాలయ్య ‘లెజెండ్’ ఆడియో ఫంక్షన్ కి చంద్రబాబు ను ఆహ్వానించక పోవటంతో వీరి మధ్యన ఏవో మనస్పర్థలు వచ్చాయిని కధనాలు వినిపించాయి. ఈ ఊహాగానాలు మరింత జోరందుకోవటంతో వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నేరుగా బాలయ్య రంగంలోకి దిగి చంద్రబాబుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బాలయ్య. ఈరోజు జరగబోయే ‘లెజెండ్’ ఆడియో ఫంక్షన్ లో తన అభిమానులు వీరావేశంతో ‘కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య’ అనే ఉత్సాహ పూరితమైన నినాదాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అదేవేధిక పై చంద్రబాబు బాలయ్యతో కలిసి ఉంటే చంద్రబాబుకు అసౌకర్యంగా మారుతుంది కాబట్టి ఈ నినాదాలు లేనిపోని తల నొప్పులు పెంచుతాయని వ్యూహత్మకంగా నేడు జరుగుతున్న ‘లెజెండ్’ ఆడియో వేడుకకు తన బావ చంద్రబాబును బాలయ్య వ్యక్తిగతంగా పిలవలేదనే మాటలు వినిపిస్తున్నాయి.  కానీ ఎపిహెరాల్డ్ కు అందుతున్న విశ్వసనీయ సమాచరం మేరకు బాల కృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వ్యవహారాల వల్ల కలతచెంది బాబుకు చిన్న ట్విస్ట్ ఇవ్వడానికే బాలయ్య ఈ వ్యవహారం నడిపించాడు అనేమాటలు కూడా వినిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ఈరోజు జరుగుతున్న “లెజెండ్” ఆడియో వేడుక బాలయ్య అభిమానులలో అంచనాలను పెంచుతోంది. రానున్న ఎన్నికలలో బాలయ్య కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమై ఎన్నికల పోటీకి దూరంగా ఉండి సినిమాల పైనే దృష్టి ఎక్కువగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట ఈ నందమూరి సింహం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: