మెగా డైరెక్టర్‌కు క్రేజీ ఆఫర్
చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ద మెమరబుల్ హిట్ రౌడీ అల్లుడు. ఈ సినిమా ఇన్స్ పిరేషన్ తో కథ రెడీ చేసుకున్న హరీష్.. ఈ స్టోరీ మెగాస్టార్ కి చెప్పగానే మారు మాట్లాడకుండా ఓకే చెప్పేశారట. ఈ సినిమా ఫ్యాన్స్ ని ఫుల్ టెప్ట్ చేసే లా తయారు చేస్తానని, చిరంజీవిని ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాలో చూస్తారని , ఫ్యాన్స్ థియేటర్ కి మళ్లీ మళ్లీ వచ్చేలా ఉంటుందని , ఇంట్రస్టింగ్ న్యూస్ చెబుతున్నాడు హరీష్. చిరంజీవి తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెబుతున్నాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్పుడు డైరెక్టర్ లా కాకుండా ఓ అభిమానిగా సినిమా చేస్తానంటున్నాడు. పవర్ స్టార్ తో చేసే సినిమా.. అభిమానులకు విజువల్ ఫీస్ట్ అని, అభిమానులు ఏం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని, పవన్ కళ్యాణ్ కి ఇది స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోయే సినిమాగా రెడీ చేస్తున్నట్టు కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్. మెగాస్టార్, పవర్ స్టార్ తోపాటు సూపర్ స్టార్ కి కూడా స్టోరీ రెడీ చేస్తున్నాడు. మహేష్ కోసం మంచి స్టోరీ రెడీ చేస్తున్నట్టు చెబుతున్నాడు హరీష్ శంకర్. మహేష్ తో కూడా ఓ ఇంట్రస్టింగ్ సినిమా చెయ్యాలనుందని, అందుకే ఆయన ఇమేజ్ కి తగినట్టు కథ రెడీ చేస్తున్నట్టు చెప్పాడు హరీష్ శంకర్. ఇలా స్టార్ హీరోలకు వరుసగా సినిమాలు చేసే బంపర్ ఆఫర కొట్టేశాడు హరీష్.