గతంతో పోలిస్తే, పర్లేదు కొంచెం తగ్గినట్లుందే....??

GVK Writings

ముందుగా తెలుగు సినిమా పరిశ్రమకు వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా భామ ఇలియానా. అయితే నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఇలియానా, ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ సినిమా అప్పట్లో 75 ఏళ్ల సినిమా చరిత్రలో గతంలో ఉన్న రికార్డుని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ ని నమోదు చేసుకుంది. 

 

ఇక ఆ సినిమాతో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు గడించిన ఇలియానా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా మంచి సినిమా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆ తర్వాత రాను రాను కొత్త హీరోయిన్ల రాకతో ఇలియానాకు మెల్లగా అవకాశాలు తగ్గాయి. ఆపై కొన్నాళ్ల తర్వాత తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసి కొన్నాళ్లు ప్రేమాయణం సాగించిన ఇలియానా, మెల్లగా సినిమా తెలుగు సినిమాలకు దూరం అయింది. అయితే అడపదడప అక్కడక్కడా మాత్రం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆ సమయంలో విపరీతంగా లావుగా తయారైన ఇలియానా, ఇటీవల రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ లో నటించింది. అయితే ఆ సినిమాలో కూడా కొంత బొద్దుగా ఉన్న ఇలియానా, ఇటీవల కొన్నాళ్లుగా తన శరీర బరువును తగ్గించుకునే పనిలో పడింది. 

 

ఇక కొద్ది రోజుల నుంచి దేశంలో కరోనా వ్యాధి ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో, ఇంటిపట్టునే ఉంటూ ఎప్పటికప్పుడు శరీరకంగా బాగా వ్యాయామాలు చేస్తూ కొంతవరకు శరీర బరువును తగ్గించుకున్న ఇలియానా, కొద్ది రోజుల క్రితం ఒక ఫోటో అని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని బట్టి, గతంతో పోలిస్తే ఇలియానా కొంతవరకు సన్నబడిందని అర్థమవుతుంది. మరి ఈ విధంగా స్లిమ్ గా తయారువుతున్న ఇలియానాకు, ఎంతవరకు మళ్ళీ సినిమా అవకాశాలు లభిస్తాయో వేచిచూడాలి.....!!

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
How I look at the jeans I used to fit into. Sometimes with a few tears.

A post shared by (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: