ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగిన నాని..!

Suma Kallamadi

మనం ఏం చేయగలం ఎందులో విజయాలు సాధించగలం అని మనల్ని మనం అంచనా వేసుకొని 100% కష్టపడితే కచ్చితంగా విజయం చేకూరుతుందనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో నాని ఎంతగా విజయవంతమయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ఇంటి పక్కన కుర్రాడిలా ఉండే హీరో నాని స్వతహాగా పైకి వచ్చిన హీరోలలో ఒకరు. 1984 ఫిబ్రవరి 21న ఘంటా రాంబాబు విజయలక్ష్మి దంపతులకు హైదరాబాద్ నగరంలో జన్మించాడు నవీన్ బాబు. ఇతని అసలు పేరు నవీన్ బాబు అయినప్పటికీ... అతని బంధు మిత్రులందరూ నాని అనే ముద్దుగా పిలిచేవారు. దాంతో తన అసలు పేరుగా నాని అని ముద్ర పడిపోయింది.


ఉద్యోగరీత్యా నాని తల్లిదండ్రులు హైదరాబాదుకి మకాం మకాం మార్చి అక్కడే స్థిరపడి పోయారు. నాని అమ్మ విజయలక్ష్మి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తే... తన తండ్రి రాంబాబు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో నాని చాలా భయస్తుడు కావడంతో అతని అందరూ ఏడిపించేవారు టార్చర్ పెట్టువారు. ఒకానొక రోజు తన బాబాయి ధైర్యం చెప్పడంతో తనని వేధించే తోటి విద్యార్థుల లో ఒకరిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి అందరికీ చెమటలు పట్టించాడు. ఆ తర్వాత నుండి నాని అంటేనే పాఠశాలలోనే విద్యార్థులంతా గడగలాడి పోయేవారు.


ఆ తర్వాత చిన్నగా తన చదువు పూర్తి చేసి శ్రీను వైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. కొన్ని రోజులపాటు హైదరాబాద్ నగరంలో రేడియో జాకీగా కూడా పనిచేశాడు. ఆ క్రమంలోనే ఒక ప్రకటన ద్వారా అష్టా చమ్మా సినిమా ఆడిషన్స్ కి వెళ్లి ఎంపిక కాబడ్డాడు. ఆ సినిమా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కాస్త హీరోగా మారిపోయి ఎన్నో అవకాశాలను చేజిక్కించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చాలా అలరించింది. ఎవడే సుబ్రహ్మణ్యం, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మెన్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలాంటి మంచి కథలను ఎంచుకుని సూపర్ స్టార్ గా ఎదిగాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: