మరోసారి తన మానవత్వాన్ని చాటిన సోనూసూద్‌ ...!

Suma Kallamadi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానంతో.. అన్ని రంగాల సంస్థలు మూతపడ్డాయి. దీనితో వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వాళ్ల సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇక వలస కార్మికుల కోసం ప్రముఖ నటుడు సోనుసూద్ మరోసారి తన ఉదారతను చాటుకోవడం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు వాల్ల స్థలాలకు చేరేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు అందుకొని  ఆయన రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది.

 

నేడు సోనూసూద్ అనుమతి తీసుకున్న బస్సులు థానే (మహారాష్ట్ర), గుల్బర్గా (కర్ణాటక) నుంచి బయలుదేరడం జరిగింది. ఇక ఈ తరుణంలోనే సోనుసూద్ వద్దకు వెళ్లి కార్మికులకు గుడ్ బాయ్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వలస కార్మికులకు వారి స్వస్థలాలకు తరలించేందుకు నేను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వ అధికారుల నుంచి అధికారికంగా అనుమతులు తీసుకుని.. కార్మికులను 10 బస్సులలో వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సహాయం చేశాను అని తెలిపాడు. అలాగే పిల్లలు వృద్ధులతో వలస కార్మికులు రోడ్లపై నడుస్తూ ఉంటే నా హృదయం ద్రవించింది అని తెలిపారు. అంతే కాకుండా ఈ రెండు రాష్ట్రాలకు కాదు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులకు సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడం జరిగింది.

 


ఇక వలస కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నాకు సానుకూలంగా స్పందించడం జరిగింది అని సోనూసూద్ తెలిపారు. ఇటీవల సోనుసూద్ పంజాబ్ లోని వైద్య అధికారులకు 1500 వ్యక్తిగత సంరక్షణ పరికరాల కిట్స్ ను కూడా అందజేయడం జరిగింది. అంతేకాకుండా జుహూలోని తన హోటల్స్ లో వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులకు కు కూడా వసతి కల్పించేందుకు సహాయ పడటం జరిగింది అని ఆయన తెలిపాడు. ఇలా సోనూసూద్ తో పాటు అన్ని రంగాల వారు కొందరు వారికీ తగినంత సహాయం అందిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: