`అన‌సూయ‌` ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేము..!!

Kavya Nekkanti

సాధార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌స్పెన్స్ & థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మాములుగా లవ్ , రొమాన్స్ ,డ్రామా, ఫామిలీ ఎమోషన్స్ లాంటి ఫీలింగ్స్ మనం మన రోజు వారి జీవితాలలో రియల్ టైం గా ఎక్సపీరియన్సు అవుతాము. కానీ థ్రిల్లర్ , సస్పెన్స్ , హారర్ లాంటివి ఎక్కువ మంది ఎక్సపీరియన్సు అయి ఉండరు. అందుకే వాటిని సినిమాలా ద్వారా ఎక్స్పీరియన్స్ అయి ఆనందించటానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే  స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతారు. అలాంటి సినిమాల్లో `అన‌సూయ‌` ఖ‌చ్చితంగా ఉంటుంది.

 

2007 లో రవి బాబు‌ దర్శకత్వం వహించిన అనసూయ సినిమా మంచి విజయం సాధించింది. ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంలో భూమిక చావ్లా, రవి బాబు, అబ్బాస్, నికిత తుక్రల్, మేల్కోటి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించరు.  ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు. ఈ సినిమా క‌థ‌లోకి ఓ సారి తొగి చూస్తే.. అనసూయ(భూమిక‌) ఒక అనాథ. క్రిమినల్ సైకాలజీ (నేరస్థుల మనస్తత్వ అధ్యయన శాస్త్రం) లో పీజీ పూర్తి చేసి ఓ టీవీ చానల్ లో రిపోర్టరు గా చేరుతుంది. తన వృత్తిలో భాగంగా వరుస హత్యలు చేస్తూ, శవాల్లోని కొన్ని అంతర్భాగాలు మాయమయ్యే ఒక విచిత్రమైన కేసు వెనుక రహస్యాన్ని పరిశోధించాల్సి వస్తుంది. 

 

హతకుడు హత్య చేసిన తర్వాత ఆ స్థలంలో ఒక గులాబీ పువ్వు వదిలి వెళుతుంటాడు. ఈలోగా ఓ పోలీసు ఆఫీసరు(అబ్బాస్) కూడా హంతకుణ్ణి పట్టుకోవడానికి నియమితుడవుతాడు. వీటన్నింటికి కారణం గులాబీ పువ్వు గోవిందు(ర‌విబాబు) అనే వ్యక్తి కావచ్చని నిర్ధారణకు వస్తుంది. అతని నేపథ్యాన్ని పరిశీలిస్తూ గోవిందు గతంలో ప్రేమించిన ఓ మెడికో అమ్మాయి గురించి వెతుకుతుంది. ఆ అమ్మాయి గోవిందు ప్రేమని అంగీకరించి ఉండదు. అసలు గోవిందు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అతన్ని అనసూయ ఎలా అంతమొందించిందీ అన్నది ఈ సినిమా కథ. ఈ చిత్రం అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్ట‌కుంటుంది. క్ష‌ణ‌క్ష‌ణం.. సినిమాలో ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ ప్రేక్ష‌కుడిలో క‌నిపిస్తుంది. ఇక‌ ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎన్ని సార్లు టీవీలో వ‌చ్చినా ప్రేక్ష‌కులు వ‌దిలిపెట్ట‌ర‌నే చెప్పాలి.


 
  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: