ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ మూవీ తెలుగులో ఇప్పటివరకు రాలేదు..!

Suma Kallamadi

స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కామెడీ అక్కడక్కడా కలిగిన డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ద్వారానే తొలిసారిగా వెండితెరపై కనిపించిన నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే ఒక బ్రిలియంట్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తాడు. చాలా తెలివి ఉన్నప్పటికీ అతని వద్దకు చిన్నా చితకా క్రైమ్ కేసులు మాత్రమే వస్తాయి. వాటన్నిటినీ టీ తాగిన అంత సులువుగా హాస్యభరితముగా ఛేదిస్తుంటాడు ఆత్రేయ. 2019 వ సంవత్సరం లో పెట్టిన బడ్జెట్ కి 10% రెట్టింపు డబ్బులు వచ్చిన ఏకైక సినిమాగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నిలిచింది.



సినిమా హిట్ కావాలంటే బడా స్టార్ల అవసరం లేదని, హీరోయిన్ అందాల ఆరబోతలు, అడల్ట్ కంటెంట్ అసలే అవసరం లేదని, ఫైట్స్, ఫుల్ లెన్త్ కుళ్ళు కామెడీ ఇంకా ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ అవసరం లేదని చాలామంది దర్శక నిర్మాతలకు గట్టిగా చెప్పింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ చిత్రంలో కథ తప్ప మరెవరు హీరో కాదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి గొప్ప డిటెక్టివ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు నవీన్ పొలిశెట్టి కచ్చితంగా సంతోష పడాల్సిన విషయమే. ఇలాంటి చిత్రమే మళ్లీ ఇంకొకటి సీక్వెల్గా తీయాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు అంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నారో స్పష్టమవుతుంది. ఆత్రేయ సినిమా ఇప్పటివరకూ వచ్చిన అన్ని థ్రిల్లర్ చిత్రాలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని థ్రిల్లర్ మూవీస్ లలో ముందుగానే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ వివరంగా రివిల్ చేస్తూ ఉంటారు. కానీ ఆత్రేయ సినిమాలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్లుప్తంగా రివీల్ చేయబడతాయి. ఈ విధంగా ఆత్రేయ మూవీ వీక్షకులను స్క్రీన్ లకు కట్టిపడేస్తుంది.


బడా స్టార్స్ గా పిలవబడే చాలామంది టాలీవుడ్ హీరోలు ప్రేమించడం, పాట పాడటం, డాన్స్ చేయడం, ప్రతినాయకుడు కొట్టడం చంపడం లాంటి సినిమా స్క్రిప్ట్ లో తప్ప మరే ఇతర కొత్తరకం కథను తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించటం లేదు. వీటన్నింటికి భిన్నంగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వచ్చి వీక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కల్పించింది. ఆత్రేయకు అసిస్టెంట్ పాత్ర అయిన స్నేహ పాత్రలో నూతన నటీమణి శృతి కూడా చాలా చక్కగా నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: