అలాంటి మ‌గాళ్లంటే పిచ్చి... విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్‌..!

VUYYURU SUBHASH

హీరోలు, హీరోయిన్ల నుంచి ఎవ‌రైనా త‌క్కువ టైంలో పాపుల‌ర్ అయ్యేందుకు ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, సోష‌ల్ మీడియానే ప్ర‌ధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలోయాంకర్లు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక క‌రోనా వ‌చ్చాక పాపుల‌ర్ అయ్యేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక వీడియో చేయ‌డం దానిని త‌మ సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌డం ద్వారా బాగా పాపుల‌ర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో యాంక‌ర్ విష్ణు ప్రియ కూడా చేరి పోయింది. 

 

తాజాగా విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. త‌న‌కు ఎలాంటి మ‌గాళ్లు ఇష్ట‌మో చెపుతూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌న మ‌య్యాయి. సుడిగాలి సుధీర్ తో క‌లిసి ఆమె పోరా పోవే షోలో చేసిన సంద‌డితోనే ఆమెకు పిచ్చ పాపులారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం షోలు లేక‌పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటోన్న ఆమె త‌న హాట్ ఫొటోలు.. డ్యాన్సులు చేసిన వీడియోలో పోస్ట్ చేస్తూ కావాల్సినంత ర‌చ్చ చేస్తూ సోష‌ల్ మీడియా వాళ్ల‌కు మాంచి కిక్ ఇస్తోంది.

 

ఈ క్ర‌మంలోనే తాను మ‌నువాడ బోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన ఆమె త‌న‌కు కాబోయే వాడికి దేవుడికి ఉండాల్సి నంత ఓర్పు ఉండాల‌ని... త‌న‌ను భ‌రించాలంటే అంత ఓర్పు అవ‌స‌రం అని కూడా చెప్పింది. ఇక త‌న‌కు చాలా పొడుగ్గా ఉన్న కుర్రాళ్లు అంటే ఇష్ట‌మ‌ని.. అర‌బిక్ ఫేస్ క‌ట్స్‌తో హాట్ నెస్‌గా ఉన్న కుర్రాళ్లు అంటే త‌న‌కు చాలా చాలా ఇష్ట‌మ‌ని చెపుతోంది. 

 

చూడ‌గానే చెమ‌ట‌లు ప‌ట్టించేంత హాట్ నెస్ ఉన్న కుర్రాళ్లు అంటే తానుప‌డి చ‌స్తాన‌ని విష్ణు ప్రియ చెపుతోంది. హాట్ లుక్స్‌తో ఉన్న కుర్రాడు త‌న‌కు క‌న‌ప‌డితే వెంట‌నే వెళ్లి యు ఆర్ హాట్ అని చెప్పేస్తానంటోంది. హైద‌రాబాద్‌లో అలాంటి వాళ్లు త‌క్కువ‌ని.. వాళ్లు క‌న‌ప‌డితే తాను నేత్రానందం పొందుతాన‌ని విష్ణు ప్రియ చెపుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: