రానా ప్రియురాలి గురుంచి పూర్తి వివరాలు, ఫోటోలు..?

praveen

మామూలుగానే మీడియాకి చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల లవ్ స్టోరీస్ గాసిప్  ఏదైనా దొరికింది అంటే ఫుల్ మీల్స్  పెట్టినంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అటు సినీ ప్రముఖులు తమ ప్రేమ వ్యవహారాల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడితే ఎలాగైనా తెలుసుకోవడానికి మీడియా వాళ్లు మాత్రం ఆరాటపడుతుంటారు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీ లవ్ గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది అంటారా.... ప్రస్తుతం రానాకు సంబంధించిన చర్చ ఇంటర్నెట్ జరుగుతుంది.

తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ని పరిచయం చేస్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రానా . దీంతో ఆ అమ్మాయి ఎవరు ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి విపరీతంగా సోషల్ మీడియాలో సెర్చ్  చేయడం ప్రారంభించారు నెటిజన్లు. కాగా  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో   రానా కూడా ఒక్కరు అన్న విషయం తెలిసిందే. 

 అలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి  త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు అనే సమాచారం అందింది. తన ప్రేమను తన ప్రేయసి అంగీకరించింది అని చెబుతూ షీ సెడ్ ఎస్  అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు రానా . ఈ పోస్టు సోషల్ మీడియాలో అప్లోడ్ అయిందో లేదో.. ఆ అమ్మాయి గురుంచి తెలుసుకోవటం  మొదలు పెట్టారు నెటిజన్లు . తిరిగి నెటిజన్లను రానా పోస్ట్ పై  స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఈ అమ్మాయి ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.


 అయితే రానా పెళ్లి చేసుకోబోయే  అమ్మాయి పేరు మిహిక బజాజ్... హైదరాబాది  అయిన ఈ అమ్మాయి మూడు సంవత్సరాల క్రింద వరకు తల్లి బంటి  బజాజ్ కి వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ లో సహాయం చేస్తూ ఉండేది. 2017లో ద్వితీయార్థంలో సొంతగా డ్యూ డ్రాప్స్ అనే  ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను ప్రారంభించింది మిహిక  బజాజ్. ప్రస్తుతం వెడ్డింగ్ ప్లానింగ్  తో పాటు ఇంటీరియర్ డిజైన్ కంపెనీ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. ఇక ఈ అమ్మాయికి గిఫ్ట్స్ అంటే ఎంతో ఇష్టం. భవిష్యత్తులో గిఫ్ట్స్  సంబంధించి ఒక కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నాలు కూడా చేస్తుందట ఈ అమ్మాయి. ఫుడ్ అంటే  అమితంగా ఇష్టపడుతుందట  మిహిక.  తినడమే కాదు వండడం కూడా బాగా తెలుసుట ఈ అమ్మాయికి. పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉందట. ప్రస్తుతం ఈ  అమ్మాయి కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: