సమంత మగశునకం పై హాట్ కామెంట్ చేసిన అర్జున్ కపూర్..!
లాక్ డౌన్ కారణంగా సినీ చిత్రీకరణలు నిలిపివేయడంతో సమంత అక్కినేనికి మొట్టమొదటిగా విశ్రాంతి దొరికింది. దాంతో తన భర్త అయిన నాగ చైతన్య తో కలసి విలువైన సమయాన్ని గడుపుతుంది. తన పెంపుడు కుక్కకి బాగా చేరువయ్యి తన ఈ సమయాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా తన పెంపుడు కుక్క 'హాష్' కి సంబంధించిన ఒక ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో సమంత అక్కినేని ఎటువంటి మేకప్ వేసుకోలేదు. ఆమె కుర్చీలో కూర్చొని తన కుక్కని ఒక బల్లపై కూర్చోపెట్టగా... నాగచైతన్య వీళ్ళిద్దరి ఫోటోలు తీశాడు. సమంత వేరే వైపు చూస్తుండగా... తన హాష్ మాత్రం కెమెరా వైపు తదేకంగా చూస్తోంది. ఈ ఫోటోకి సమంత అక్కినేని... 'గుడ్ లైట్, గుడ్ స్కిన్, గుడ్ పప్పీ... ఈ రోజంతా నూతన ఆశయాలతో సంతృప్తిగా గడిచిపోయింది' అని పేర్కొంది. ఐతే ఈ చిత్రంపై ఇషాక్ జాదే హీరో అర్జున్ కపూర్ ఒక కామెంట్ చేశాడు. 'మీ కుక్క చాలా హ్యాండ్సమ్ గా ఉంది' అంటూ హాట్ నెస్ ని సూచించే ఒక ఫైర్ ఇమేజిని తన కామెంట్ లో పెట్టాడు.
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా ఈ ఫోటోపై కామెంట్ చేసింది. మంచి శునకం తన అమ్మ(సమంత)కు ప్రేమ చూపించడం వాళ్ళ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది అని సమంత చందమామ లాంటి చక్కటి మొహం గురించి పొగిడింది. ఈ చిత్రంలో సమంతా గ్లోయింగ్ స్కిన్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ అనుపమ పరమేశ్వరన్ కూడా వ్యాఖ్యానించారు. బహుశా నీ చక్కని మనసు వల్ల మీ చర్మం ఇంతలా మెరుస్తుందనుకుంటా అని కామెంట్ చేయగా... రకుల్ ప్రీత్ సమంతా గ్లోయింగ్ స్కిన్ ని ఉద్దేశిస్తూ 2 హాట్ ఎమోజిఎస్ ని పోస్ట్ చేసింది.
ఇటీవల సమంత తన కుక్క హాష్ కలసి బెడ్ రూమ్ లో నిద్రపోతుండగా నాగచైతన్య ఫోటో తీసాడు. ఆ ఫోటో ని సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసి నిద్రపోవడం మా కంటే పర్ఫెక్ట్ గా ఎవరు చేయలేరు అంటూ క్యాప్షన్ పెట్టింది. లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం సమంత అక్కినేని అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనుంది. అలాగే తన మొట్టమొదటి వెబ్సెరీస్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా ఆమె నటించనున్నది.