నే ఛుక్ ఛుక్ బండినిరో అంటూ కుర్రకారుకి చమటలు పట్టించిన శ్రియ..!
2007వ సంవత్సరంలో విడుదలైన తులసి మూవీ లో దగ్గుబాటి వెంకటేష్, నయనతార హీరో హీరోయిన్ల గా నటించగా... దేవి శ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చారు. ఈ సినిమాలో మాస్టర్ అతుల్ వెంకటేష్ నయనతారల కొడుకు పాత్ర లో చాలా చక్కగా నటించాడు. తులసి మూవీ మలయాళంలో కూడా అదే టైటిల్ తో విడుదల అయింది. రమ్యకృష్ణ, రాహుల్ దేవ్, ఆశిష్ విద్యార్థి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్ బాబు తన సొంత సురేష్ బాబు ప్రొడక్షన్స్ కింద నిర్మించాడు.
ఐతే ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ లో 'నే ఛుక్ ఛుక్ బండి నిరో, అరేయ్ కుదురితే ఆగనురో' అంటూ శ్రియా శరణ్ ఒక ఊపు ఊపింది అని చెప్పుకోవచ్చు. 2020 లో కూడా ఈ పాటని యూట్యూబ్ లో లక్షల మంది వీక్షిస్తున్నారు. ఐటమ్ సాంగ్ పాటలో శ్రేయ శరణ్ ఒలికించిన అందచందాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు మంత్ర ముగ్ధులయ్యారు. 2007వ సంవత్సరంలో శ్రేయ శరన్ పలు భాషల సినిమాలతో షెడ్యూల్ తో బిజీగా ఉన్న సమయంలో తులసి లో ఐటమ్ సాంగ్ పాటలో చేయాలని కోరగా... ఆమె విక్టరీ వెంకటేష్ మాట తీసేయలేక ఒప్పుకుంది.
ఈ పాటలో వెంకటేష్ ఆమెతో కలిసి చేసిన రొమాంటిక్ డాన్స్ ప్రేక్షకులను బాగా అలరించింది. విశేషమేమిటంటే ఈ ఐటమ్ సాంగ్ ని మాల్గుడి శుభ తో కలిసి దేవి శ్రీ ప్రసాద్ కూడా ఆలపించారు. ఈ చిత్రంలో మిగతా పాటలు కూడా తెలుగు శ్రోతలను బాగా ఆకట్టుకొన్నాయి. వెన్నెలింత, తుల తుల తులసి, నీ కళ్ళతోటి మెలోడీ పాటలు ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ సాంగ్స్ గా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా దేవిశ్రీప్రసాద్ కారణంగానే తులసి సినిమా హిట్ అయిందని చెప్పవచ్చు.