గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారి ప్రేమలు పెళ్లిళ్లు అన్నితాత్కాలికమే. ఎన్నో ఆశలతో ఒక్కటైన చాలా జంటలు కొద్ది రోజులకే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఏళ్ల తరబడి డేటింగ్ చేసిన వారు కూడా పెళ్లి తరువాత కలిసి ఉండలేకపోతున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతుంటాయో అదే స్థాయిలో బ్రేకప్‌లు కూడా జరుగుతుంటాయి. అయితే తనకు ఎదుటి వ్యక్తితో సరిపడదని ముందే తెలుసుకున్న కొంత మంది తారలు పెళ్లిళ్లకు నై అనేస్తున్నారు.
అలాగే పీటల దాకా వచ్చిన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంది అందాల భామ త్రిష. సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఎంగేజ్మెంట్ తరువాత తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. నిశ్చితార్ధం చేసుకుని, పీటల వరకూ చేరిన పెళ్లిని బ్రేకప్ చేసుకున్న ఈ భామ ఆ తరువాత పెళ్లి పట్ల తన అభిప్రాయాన్నే మార్చేసుకుంది. కెరీర్ అనే వంకతో ఆమె పెళ్లికి దూరమైన అసలు విషయం వేరు ఏదో ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు విశ్లేషకులు. అయితే బ్రేకప్ తరువాత కెరీర్ పరంగా మాత్రం ఫుల్ బిజీ అయిపోయింది త్రిష.
ప్రస్తుతం పెళ్లి గురించి పట్టించుకునేంత టైమ్ కూడా లేనంత బిజీగా సినిమాలు చేస్తోంది త్రిష. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్రిష క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా ఫిక్సయిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళంలో మెగాస్టార్ మోహన్‌లాల్ తో రామ్ సినిమాలో నటిస్తోంది. తమిళంలో వరుస ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యింది. కెరీర్ పక్కన పెడితే పెళ్లి విషయంలో మాత్రం అమ్మడు గట్టి నిర్ణయమే తీసుకుంది. అసలు తనకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదంటూ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఒక్కరితో రిలేషన్ చెడిపోయినంత మాత్రానా ఏకంగా వివాహ వ్యవస్థనే తప్పుపట్టడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్.
మరింత సమాచారం తెలుసుకోండి: