ప్రస్తుతం సినీ రంగం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరు సల్మాన్ ఖాన్, ప్రభాస్. అయితే ఈ ఇద్దరు పెళ్లి అంటే మాత్రం ఆమడదూరం పారిపోతున్నారు. ఇప్పటికే పెళ్లి వయసు దాటేసిన సల్మాన్ పెళ్లి గురించి ఈ మధ్య పెద్దగా చర్చ జరగటం లేదు. కానీ ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇండియాస్ టాప్ హీరో ను మనువాడ బోయే ఆ అదృష్ట వంతురాలు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడాగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. బాహుబలి తొలి భాగం షూటింగ్ సమయంలోనే ప్రభాస్ పెళ్లి వార్తలు తారా స్థాయికి చేరాయి. దీంతో బాహుబలి తొలి భాగం తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. కానీ అది జరగలేదు. రెండో భాగం కూడా రిలీజ్ అయ్యింది. పెళ్లి విషయంలో ప్రభాస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తరువాత సాహో కూడా రిలీజ్ అయ్యింది. అయినా పరిస్థితిలో నో చేంజ్. ఆఖరి పెదనాన్న కృష్ణం రాజు కూడా ప్రభాస్ పెళ్లికోసం ఎదురుచూస్తున్నాం అంటూ చెప్పాడు. కానీ పెళ్లి ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేకపోయాయడు.
మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి త్వరలోనే పెళ్లి విషయం ప్రకటిస్తామని చెపుతూ దాటవేస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రభాస్ మాత్రం పెళ్లి అంటేనే పట్టనట్టు బిహేవ్ చేస్తున్నాడు. గతంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ప్రభాస్, అనుష్కలు ఆ వార్తలను ఖండించారు. తరువాత ఓ భీమవరం అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు కూడా నిజం కాలేదు. మరి ఇప్పటికైన ప్రభాస్ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇస్తాడా...? లేక సల్మాన్ ఖాన్ లాగే లైఫ్ టైం బ్యాచిలర్‌గా మిగిలిపోతాడా..? చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: