ఫ్యామిలీ డే రోజున మహేష్ సోదరి స్పెషల్ పోస్ట్ వైరల్..?
మామూలుగా కొంతమందికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి అనే విషయం తెలిసిందే. స్నేహితులకు సంబంధించి ఫ్రెండ్షిప్ డే.. తల్లులకు సంబంధించి మదర్స్ డే... మహిళలకు సంబంధించి ఉమెన్స్ డే.. ఇలా చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా కేటాయించబడుతుంది. అయితే ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే కూడా ఉంది. ప్రతి సంవత్సరం మే 15వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ప్రపంచవ్యాప్తంగా అందరు జరుపుకుంటారు. ఎప్పుడు బిజీ బిజీగా ఉండేవారు ఇంటర్నేషనల్ ఫామిలీ డే రోజు తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఉంటారు.
అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫామిలీ డే సందర్భంగా మన తెలుగు సినీ సెలబ్రిటీలు అందరూ కుటుంబంతో సరదాగా గడిపిన వీడియోలు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ అందరికి ఇంటర్నేషనల్ ఫామిలీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల... తన కుటుంబానికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది నా కుటుంబం... నేను, సంజయ్, జాను, స్నోవీ అంటూ అందరి పేర్లను తెలుపుతూ ఒక పోస్టు పెట్టింది మహేష్ సోదరి మంజుల. మేమందరం కలిసి ఆడుకుంటాము... అన్నింటినీ పెంచుకుంటాము.. కలిసి భోజనం చేస్తాము.. అందరం కలిసి హాయిగా నవ్వుకున్నాము... ఒకరితో ఒకరు ఫైట్ చేస్తాము.. ఆలోచనల్లో మునిగి పోతాము అంటూ ఒక కొటేషన్ కూడా చెప్పింది మహేష్ సోదరి మంజుల. కుటుంబం ఎంతో విలువైనది అంటూ చెప్పుకొచ్చింది. మీకోసం కుటుంబంతో కృతజ్ఞతతో ఉండండి.. నేను నా కుటుంబం గురించి ఉంటాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది.
Well, This is my FAMILY! ~ Me, Sanjay, jaanu, Snowy💛
We play, share, dine & laugh together. We also fight, sulk and make up with each-other like every other. But that’s what makes it precious; a family.
Be thankful for yours, I am for mine. ♥️#InternationalDayoftheFamily pic.twitter.com/eWhZCvFKGY — manjula Ghattamaneni (@ManjulaOfficial) May 15, 2020