హరీష్ శంకర్ బండ్ల గణేష్ ల మధ్య చిచ్చురేపిన గబ్బర్ సింగ్ వార్షికోత్సవాలు !

Seetha Sailaja

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే నిన్న విడుదలై ఉండేది. అయితే కరోనా దెబ్బతో ఆసినిమా విడుదల ఆగిపోవడంతో పవన్ అభిమానులు ఆలోటును ‘గబ్బర్ సింగ్’ విడుదలకు సంబంధించి 8వ వార్షికోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా జరుపుకుని ఆవిధంగా ‘వకీల్ సాబ్’ విడుదల అవ్వని బాధను మరిచిపోయారు.

 

 పవన్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించిన ‘గబ్బర్ సింగ్’ 8వ వార్షికోత్సవ సంబరాలు ఎవరు ఊహించని విధంగా నిర్మాత బండ్ల గణేష్ దర్శకుడు హరీష్ శంకర్ ల మధ్య చిచ్చు పెట్టాయి అని తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్’ మూవీ విడుదలై 8సంవత్సరాలు అయిన సందర్భంగా హరీష్ శంకర్ అందరికీ కృతఙ్ఞతలు చెప్పుతూ ట్విట్టర్ లో ఒక లెటర్ విడుదలచేసిన విషయం తెలిసిందే.

 

అయితే ఆ లెటర్ లో నిర్మాత బండ్ల గణేష్ పేరు మాత్రం హారీష్ శంకర్ ప్రస్తావించలేదు. ఈవిషయం బండ్ల గణేష్ దృష్టి వరకు రావడంతో అతడు ఈవిషయాన్ని చాల సీరియస్ గా తీసుకున్నట్లు టాక్. హరీష్ శంకర్ ను తాను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేసి ‘గబ్బర్ సింగ్’ మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేలా కృషిచేసిన వ్యక్తిని తాను అని అలాంటి తన పేరు హరీష్ శంకర్ ఎలా మరిచిపోయాడు అంటూ బండ్ల గణేష్ తన సన్నిహితుల వద్ద అసహనానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.

 


ఈవిషయాలు హరీష్ శంకర్ దృష్టి వరకు రావడంతో ‘గబ్బర్ సింగ్’ ఆఫర్ తనకు పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిందని వాస్తవానికి ఈసినిమాను మొదట్లో నాగబాబు నిర్మించాలి అని అనుకుంటే అనుకోకుండా బండ్ల గణేష్ నిర్మాతగా మారాడని దర్శకుడుగా తనకు లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని మరెవ్వరు కాదని హరీష్ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పొరపాటున తాను చేసిన ట్వీట్ లో బండ్ల గణేష్ పేరును మర్చిపోయానని కానీ ఆతరువాత తనతప్పు తెలుసుకుని మరొక ట్విట్ చేసిన విషయం పరిశీలించకుండా తనపై బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేయడం ఏమిటి అంటూ హరీష్ శంకర్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వీరిద్దరి మధ్య ఈలాక్ డౌన్ సమయంలో ‘గబ్బర్ సింగ్’ వార్షికోత్సవాల సందర్భంగా మొదలైన అనవసరపు రగడను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: