పేదలకు నిత్యా మీనన్ ఆర్ధిక సాయం.. ఈ పద్ధతిలో

Murali

తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మళయాళీ బ్యూటీ నిత్యా మీనన్. కథా బలం ఉన్న సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసిన ఈ హీరోయిన్ సెలక్టివ్ మూవీస్ చేసి సక్సెస్ అయింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో అందరిలానే ఇంటికే పరిమితమైన నిత్యా ఇప్పుడు పేదలకు చారిటీ చేసేందుకు సిద్ధమైంది. లాక్మే ఫ్యాషన్ షోలో తాను ధరించిన ఓ ఖరీదైన డ్రెస్ ను వేలం వేయడం ద్వారా వచ్చే మొత్తాన్ని పేదలకు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో చెప్పుకొచ్చింది.

 

 

‘నా ఫ్రెండ్ కావేరీ నాకోసం ప్రత్యేకంగా ఈ డ్రెస్ డిజైన్ చేసింది. ఎంతో క్వాలిటీతో, మంచి ఫ్యాబ్రిక్ తో ర్యాంప్ వాక్ మీద నడిచేందుకు వీలుగా ఈ డ్రెస్ అందంగా డిజైన్ చేసింది. ఈ డ్రెస్ వేలం ద్వరా వచ్చే మొత్తాన్ని అర్పణం ట్రస్ట్ కు ఇస్తాను. ఈ మొత్తాన్ని గ్రామాల్లోని పేదలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించేందుకు ఉపయోగిస్తాను. వేలం మే17వ తేదీ.. ఆదివారం సాయంత్రం 4గంటలకు @indiawasted అనే సైట్లో ఆక్షన్ జరుగుతుంది’ అని ప్రకటించింది. డ్రెస్ ను కూడా చూపిస్తూ ఎంత అందంగా ఉందో నిత్యా వివరించింది.

 

 

నిత్యా మీనన్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ సైడ్’, ‘మంచి ఆలోచన’ అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నటులు అందరూ తమకు తోచిన పద్ధతిలో సాయం చేస్తున్నారు. కొందరు ఆర్ధిక సాయం చేస్తుంటే.. మరికొందరు నిత్యావసరాలు అందిస్తున్నారు. నిత్యా కూడా కొత్త పద్ధతిలో ఆర్ధికసాయం చేసేందుకు ముందుకు రావడం విశేషం. నిత్యా ప్రస్తుతం తమిళ, మళయాళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I'm giving this dress I walked the ramp in as the showstopper for @bykaveri , {{RelevantDataTitle}}