ఆ మళయాళ హీరో భార్య బాధ వర్ణనాతీతం

Murali

కరోనా మహమ్మారి విలయానికి దేశం అంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రతి వ్యవస్థ కూడా కామ్ అయిపోయింది. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ప్రతి ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి. హీరోలందరూ ఇళ్లకే పరిమితమై పోయారు. అయితే.. మళయాళ సినిమా హీరో పృథ్వీరాజ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ‘ఆడు జీవితం’ సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు పృథ్వీరాజ్. వాడి రమ్ ఎడారిలో షూటింగ్ లో ఉండగా కరోనా దెబ్బకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోయాయి.

 

 

దీంతో పృథ్వీరాజ్ అక్కడే ఇరుక్కుపోవడంతో ఆయన భార్య బాధ వర్ణణాతీతంగా మారింది. పృథ్వీరాజ్ జోర్డాన్ లో ఇరుక్కుపోవడంతో భార్య సుప్రియ మీనన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్పందించింది. 2012లో ‘మోలీ ఆంటీ రాక్స్’ అనే సినిమా షూటింగ్ పలక్కాడ్ లో జరుగుతున్న సమయంలో భర్తతో కలిసున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ‘నా భర్త పృథ్వీరాజ్ తో కలిసి ఇలా కూర్చుని సరదాగా నవ్వుకుని ఇప్పటికి 77 రోజులు అయింది. మా పెళ్లైన ఇన్నేళ్లలో ఇంత లాంగ్ సెపరేషన్ ఇదే’ అంటూ తన బాధను వ్యక్తం చేసింది. కూతురు అల్లీ కూడా డాడీ ఈరోజు వస్తాడా అని అడుగుతోందంటూ బాధ పడుతోంది.

 

 

లక్కీగా హీరోలు అందరూ ఇండియాలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలతో ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ.. ఈ మళయాళ హీరో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా మారిపోయింది. దీంతో ఆవేదన చెందిన సుప్రియ తన భర్త జ్ఞాపకాలతో ఈ ఫొటో షేర్ చేసి తన బాధను పంచుకుంది. ఈ పోస్టుకు పృథ్వీరాజ్ అభిమానులు, నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తూ ధైర్యం చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడి ఎప్పుడు పృథ్వీరాజ్ ఇండియాకు వస్తాడో చూడాలి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Throwback to 2012 when {{RelevantDataTitle}}