నా డ్రస్ నా ఇష్టం..., నువ్వు ఎవర్రా అడగటానికి అంటున్న అనసూయ భరధ్వాజ్ ...!
బుల్లి తెర మీద హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొట్టిన అనసూయ భరధ్వాజ్ మరోసారి అభిమాని పై ఫైర్ అవ్వడం జరిగింది. తాజాగా ఈమె కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఈవిడ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడుతూనే ఉంటుంది ఈ హాట్ యాంకర్. ఇక రెండు మూడు రోజుల క్రితం ఒక లైవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. అయితే ఇందులో అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కాదనకుండా వాటికి సమాధానాలు చెబుతూ వచ్చింది ఈ భామ.
ఇకపోతే ఇదే సందర్భంగా... ఒక వ్యక్తి అడిగిన వాటికి కొన్ని వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది అనసూయ భరద్వాజ్. తన భర్తతో పాటు తన పిల్లల గురించి కూడా పూర్తి వివరాలు తెలియ చేసింది ఈ హిట్ బ్యూటీ. ఇవన్నీ బాగున్నా వందలో ఒక్కడైనా మరోరకంగా ఆలోచించేవాడు ఉంటాడు కదా... ఇక్కడ కూడా అలాంటి వాడు ఒకడు తయారయ్యాడు. అతను అను ప్రశ్నలు సంధించడంలో కాస్త హద్దు మీరినట్లు జరిగింది. ఇకపోతే ఆ అభిమాని మరోసారి అనసూయ డ్రెస్ పై కామెంట్స్ చేశాడు.
ఇక ఏముంది ఇది మన జబర్దస్త్ భామకు కోపం వచ్చి అతనికి దిమ్మతిరిగే జవాబిచ్చింది. ఆ విషయంలో బాగా కోపం వచ్చినా అనసూయ రెచ్చిపోయి సమాధానం అతనికి ఇచ్చింది. అసలు నువ్వు ఎవరు రా అంటూ... మొదలు పెట్టింది ఈ భామ. అయితే ఈ సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇలాంటి విషయాల్లో కొందరు కావలసి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని చాలా కోపంగా అనసూయ ఈ విషయంపై స్పందించింది.
అసలు ఏం జరిగింది అన్న ప్రశ్నకు వస్తే పిల్లల తల్లి అయిన నువ్వు ఈ డ్రస్సు ఏంటని ప్రశ్నించి కాస్త పద్దతిగా ఉండొచ్చు కదా అని కామెంట్ చేశాడు. ఇక అంతే అనసూయ ఫుల్ ఫైర్ అయింది అతనిమీద. అసలు నువ్వు ఎవర్రా... నా డ్రస్ గురించి మాట్లాడడానికి అన్నట్లు మాట్లాడింది. ఇకపోతే అమ్మ అయితే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అని ఎక్కడైనా రూల్ ఉందా అని అమ్మతనం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటూ అతని పై విరుచుకు పడింది. మరోసారి డ్రస్సు పై కామెంట్ చేసే వారికి బాగోదు అంటూ ఫుల్ ఫైర్ అయింది జబర్దస్త్ యాంకర్. తన ట్రస్ట్ గురించి ఎవరికి మాట్లాడే అర్హత లేదు అంటూ రెచ్చిపోయింది. అసలు నా మొగుడికి నా కుటుంబానికి లేని బాధ నీకు ఎందుకు అన్నట్లుగా మాట్లాడింది అనసూయ.