'పొడుగుకాళ్ల సుందరి' కొడుకు మామూలోడు కాదండోయ్...!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పనిలేదు. ఆమె పేరుకు తగ్గట్టే శిల్పి ఉలి పట్టుకొని అందమైన శిల్పాన్ని చెక్కినట్టు ఉంటుంది శిల్పాశెట్టి శరీర సౌష్ఠవం. ఇప్పటికీ తన యోగాసనాలతో వయసు మీద పడకుండా చూసుకుంటూ వస్తోంది. చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. తెలుగులో మొదటిసారి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహస వీరుడు సాగరకన్య’ సినిమాలో సాగరకన్యగా నటించింది. ఈ సినిమాలో సాహస వీరుడుగా వెంకటేష్ నటించాడు. ఆ తర్వాత తెలుగులో మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీడెవడండీ బాబు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'ఆజాద్‌'లో ఒక హీరోయిన్ గా నటించింది. చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలే వాడివి బాసూ’ సినిమాలో చివరగా కనిపించింది. మొత్తంగా తెలుగులో నాలుగు చిత్రాల్లో నటిచింది. అంతేకాకుండా ఈ భామ అటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది.

 

ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో శిల్పాశెట్టి ఫ్యాన్స్ కోసం తన కుమారుడికి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. రాజ్‌కుంద్రా - శిల్పా శెట్టి దంప‌తుల‌కి వియాన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వియాన్ కూడా యోగాలసనాలలో తన తల్లినే ఫాలో అవుతున్నాడు. పైగా జిమ్నాస్టిక్‌ తో ఆకట్టుకుంటున్నాడు. దీనికి సంబందించి శిల్పా శెట్టి పోస్ట్ చేస్తూ.. ''తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారో దానినే పిల్లలు ఎల్లప్పుడూ అనుకరిస్తారు. మేము వ్యాయామం చేయడం మరియు యోగా సాధన చేయడం చూసి, వియాన్ తన ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. పిల్లలు చాలా శక్తిని కలిగి ఉంటారు. ఆ అపారమైన శక్తిని చక్కగా మలచడం చాలా ముఖ్యం. అతను జిమ్నాస్టిక్‌లను ప్రేమిస్తాడు, కాబట్టి నేను ప్రోత్సహిస్తున్నాను'' అని శిల్పా శెట్టి త‌న ఇన్‌స్టాగ్రాములో తెలియ‌జేసింది. ఇక శిల్పాశెట్టికి స‌మీషా అనే చిన్నారి స‌రోగ‌సీ ద్వారా జ‌న్మించింది. ఇకపోతే ఈ భామకు టిక్‌టాక్‌లో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తంగా 1 కోటి 73 లక్షల మంది ఫాలోవర్స్‌తో మన దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో శిల్పాశెట్టి చేసే టిక్‌టాక్ వీడియోలకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. టిక్‌టాక్ వీడియోస్‌లో టాప్ పొజిషన్2లో హాలీవుడ్ పర్సనాలిటీ ది రాక్‌ కు 2 కోట్ల 42 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. విల్ స్మిత్‌కు 2 రెండు కోట్ల 31 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Children always imitate whatever they see their {{RelevantDataTitle}}