సుమంత్ రెండో సినిమా 'యువకుడు'కు 20 ఏళ్లు

Murali

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి వచ్చి నటీనటుల్లో సుమంత్ కూడా ఉన్నాడు. నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా హీరోగా ఆయన ఎంట్రీ ఘనంగానే జరిగింది. తొలి సినిమా ప్రేమకథ తర్వాత ఆయన నటించిన యూత్ ఫుల్ మూవీ ‘యువకుడు’. ఈ సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రేమకథా సినిమాలు ఎక్కువగా వస్తున్న ట్రెండ్ లో వచ్చిందే ఈ సినిమా. హీరోయిన్ గా భూమికకు ఇదే తొలి సినిమా.

 

 

కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2000 మే19న విడుదలైంది. ఈ సినిమాకు ముందు కరుణాకరణ్ దర్శకత్వం వహించిన సినిమా ‘తొలిప్రేమ’. ఆ సినిమా పవన్ కల్యాణ్ ను స్టార్ హీరోని చేసింది. దర్శకుడిగా కరుణాకరణ్ పేరు తెలుగులో మార్మోగిపోయింది. సుమంత్ ను యూత్ కి దగ్గర చేసే కథాంశంతో సినిమా తీయాలని భావించిన నాగార్జున కరుణాకరణ్ తో ఈ సినిమా తీశారు. అందమైన ప్రేమకథకు తోడు దేశభక్తి కథాంశాన్ని జోడించి కరుణాకరణ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో సుమంత్ ని యూత్ ని కనెక్ట్ చేసే పాత్రలో చూపించాడు కరుణాకరణ్.

 

 

ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన భూమిక తన ఆనందాన్ని పంచుకుంది. 20ఏళ్లుగా తనను ఆదరిస్తున్న అన్ని భాషల సినీ ప్రేమికులకు కృతజ్ఞతలు తెలిపుతూ ఓ పోస్ట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమా నిర్మించాడు. మణిశర్మ అందించిన ట్యూన్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఆ టైమ్ లో మణిశర్మ టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగుతున్నాడు. నిర్మాణంలో నాగార్జున రాజీ పడకుండా భారీగా నిర్మించాడు. సుమంత్ కెరీర్లో ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Today have completed 20 Years in the Film {{RelevantDataTitle}}