నందమూరి ఇంటి రామ బాణం 'ఎన్టీఆర్'

Murali

నందమూరి తారక రామారావు అనే పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తి. అదే పేరుతో వచ్చిన ఆయన మనవడు రెండు దశాబ్దాలుగా సినిమాల్లో తన సత్తా చాటుతూ రాణిస్తున్నాడు. మరోవైపు రాజకీయ రంగంలో కూడా ఓదశలో ప్రకంపనలు సృష్టించాడు. ఆతడే.. నందమూరి హరికృష్ణ తనయుడు, తాతకు తగ్గ వారసుడు నందమూరి తారక రామారావు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గా తారక్ గా గుర్తించే ఈ హీరో అభిమానుల ఆశీస్సులతోనే ఎదిగాడు. వారి మనసుల్ని గెలిచాడు. నేడు ఆయన పుట్టినరోజు.

 

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రలో నిలిచిపోయారు. అదే పాత్రతో మనవడు ఎన్టీఆర్ కూడా 1997లో తెలుగు తెరపైకి రామ బాణంలా దూసుకొచ్చాడు. అచ్చం ఎన్టీఆర్ లా ఉన్నాడనుకున్న ఆ చిన్నారి మరో రెండేళ్లలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మరో రెండేళ్లకే సూపర్ హిట్ ఇచ్చాడు. తర్వాత ఏడాదికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాదిలో మరో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చి తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం 20ఏళ్ల వయసుకే మాస్ హీరోగా భారీ క్రేజ్ తో స్టార్ హీరో అయిపోయాడు. సింహాద్రి హిట్ తర్వాత ఆంధ్రావాలా సినిమాకు ఏర్పడిన అంచనాలు, హంగామా ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేనిది.

 

ఫ్లాపులు ఎదురైనా అదే స్థాయి క్రేజ్ తో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చేసిన ప్రచారంతో తాతకు తగ్గ అసలు సిసలు వారసుడు అనిపించుకున్నాడు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ వాగ్దాటికి, మాటలో వేగానికి, అతని ప్రజ్ఞకు ప్రజలు చేత ఔరా అనిపించుకున్నాడు. ఇప్పటికీ చాలామంది టీడీపీకి భవిష్యత్ రేఖ ఎన్టీఆర్ తోనే సాధ్యమని నమ్ముతారు. మరి ఎన్టీఆర్ మనసులో ఏముందో కాలమే సమాధానం చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: