సల్మాన్‌పై సింగర్ సోనా మహాపాత్ర ఫైర్!

Edari Rama Krishna

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. లేదా ఆయనపై ఎవరైనా సెలబ్రెటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.  ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పై గాయని సోనా మహాపాత్ర మరోసారి తీవ్ర విమర్శలు చేసింది.  ఈ మద్య టిక్ టాక్ వీడియోలు శృతి మించిపోతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో‌ హింసాత్మక వీడియోలపై స్పందిస్తూ సల్మాన్‌పై విమర్శలకు దిగింది. ఓ యువతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ముఖంపై యాసిడ్‌ పోసినట్టు చూపించిన ఓ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు.

 

అమీర్ సిద్దిఖీ సోదరుడు ఫైజల్ సిద్దిఖీ చేసిన వీడియోపై సోనా స్పందిస్తూ ఉంది. వివాదాస్పద వీడియోలో ఫైజల్ ఒక అమ్మాయిని విడిచిపెట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటాడు, ఆమె ముఖానికి అపాయన్ని కలిగించే  ద్రవాన్ని విసిరివేయడం ద్వారా ఆమె గాయపడుతుంది..  ఈ వీడియో మహిళలపై యాసిడ్ దాడులను ప్రచారం చేస్తుందని చాలా మంది చెప్పారు. ఇది ఎంత వరకు న్యాయమైన విషయం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై సోనా స్పందిస్తూ.. `మహిళలను కించపరచడం, హింసించడం ఎప్పట్నుంచో ఉంది. అప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదు. మన స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను మనం చూస్తూనే ఉన్నాం.

 

ఆయన తన స్నేహితురాళ్ల తలలపై బహిరంగంగానే సీసాలు పగలగొట్టిన ఘటనలను చాలా సార్లు చుశాం. అయినప్పటికీ ఆయన ఓ పెద్ద హీరో. ఈ పరిస్థితి ఇప్పటికైనా మారాలి` అంటూ సోనా సోషల్ మాద్యంలో  చేసింది. గతంలో కూడా చాలా సార్లు సల్మాన్‌పై సోనా తీవ్ర విమర్శలు చేసింది.  ఇప్పటికే దేశంలో మహిళలపై చివరికి చిన్నారులపై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు.. పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నారు.  ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసినవారిపై స్టార్ హూదాలో ఉన్నవారు స్పందిస్తే బాగుండు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: