స్టార్ క్రికెటర్ కూతురు.. బాలీవుడ్ నటుడు.. డేటింగ్ కోసం వెళ్లి.. లాక్ డౌన్ కారణంగా ఇరుక్కుపోయారూ..?

praveen

మామూలుగా అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా డేటింగ్ వ్యవహారాలు నడుస్తాయన్న  విషయం తెలిసిందే. కుర్ర హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ... కుర్ర హీరోయిన్ ల దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు అందరూ డేటింగ్ వ్యవహారాలను కొనసాగిస్తూ ఉంటారు. డేటింగ్ లో ఉన్న సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిందంటే చాలు... అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక డేటింగ్లో మునిగి తేలుతున్న సినీ జంట ఎక్కడైనా కనిపిస్తే.. మీడియాకు   అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలా కొనసాగుతున్న డేటింగ్ వ్యవహారాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా అటు డేటింగ్ లో ఉండే ప్రేమ జంటలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

 


 తాజాగా ఓ ప్రేమజంట లాక్ డౌన్ కారణంగా ఇరుక్కు పోయారు. డేటింగ్ కోసం  వెళ్ళి అక్కడే  చిక్కుకు పోయారు. ఇంతకీ ఈ జంట ఎవరో కాదు... దిగ్గజ క్రికెటర్ స్టీవ్  రీఛర్జ్, బాలీవుడ్ నటి మీనా గుప్తా కుమార్తె అయిన మసాబా  గుప్తా... బాలీవుడ్ నటుడు సత్య దీప్ మిశ్రా  ఎన్నో రోజులనుండి డేటింగ్ లో  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్గా మసాబా  గుప్త  మంచి గుర్తింపు తెచ్చుకుంది... నటుడిగా సత్య దీప్  మిశ్రా  మంచి గుర్తింపు సంపాదించారు. అయితే ఎన్నో రోజులనుండి డేటింగ్ లో ఉన్న ఈ జంటకు తాజాగా చిక్కులు వచ్చి పడిపోయాయి. లాక్ డౌన్  ముందు ఈ జంట గోవా ట్రిప్ కు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుదాం అనుకున్నారు. 

 


 కానీ అంతలో వీరి సరదా తీరిపోయే ఘటన జరిగింది... వీళ్లు గోవా ట్రిప్ కు వెళ్ళిన తర్వాత లాక్ డౌన్  అమలు కావడంతో ప్రస్తుతం సత్య దీపక్ మిశ్రా మసాబా  గుప్త  లు ఇద్దరూ గోవాలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే నటుడు సుత్యదీప్  మిశ్రా 2013లో అతిధి రావు హైదరి తో విడిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న మసాబా గుప్తాకు అప్పటికే పెళ్ళి జరిగిపోయింది. 2015 సంవత్సరంలో ప్రముఖ దర్శక నిర్మాతను  పెళ్లి చేసుకున్న మసాబా గుప్త మూడేళ్ళ తర్వాత ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. ఇక ఆ తర్వాత సింగిల్ గా ఉన్న మసాబా  గుప్త  సత్యదీప్  తో ప్రేమలో పడి ప్రస్తుతం డేటింగ్లో మునిగి తేలుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ జంట కలిసి ప్రత్యక్షమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: