ఫ్లాప్ హీరో కొత్త సినిమా స్టార్ట్

shami
అందాల రాక్షసి సినిమాతో ఒక డిఫరెంట్ క్యారక్టర్ తో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా అందులో నటించిన హీరో, హీరోయిన్లకు మంచి అవకాశాలే లభించాయి. ఇక ఆ సినిమాతోనే హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర వరుస సినిమాలను చేస్తున్నా సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నాడు అయినా సినిమాలు వరుసెంట చేస్తున్నాడు. రీసెంట్ గా అజయ్ అనే కొత్త దర్శకుడి డైరక్షన్ లో ఓ సినిమా స్టార్ట్ చేశాడు ఈ హీరో. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన అజయ్ డైరక్షన్ లో ఈ హీరో సినిమా తీయడం అభినందించదగ్గ విషయం. రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా ముహుర్తపు షాట్ ని క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ మధ్యనే నా రాకుమారుడుగా వచ్చిన నవీన్ చద్రను ప్రేక్షకులు అంతగా ఆదరించకపోయినా ఈ సినిమాతో కచ్చితంగా ఆదరిస్తారని చెప్పారు సిని ప్రముఖులు. ఇంకా అజయ్ గురించి సుకుమార్ చెబుతూ.. తను ఏదైనా ఫైనల్ చేయాలంటే తన టీం లో అజయ్ కి చూపించి చేస్తానని చెప్పారు. సో సుకుమార్ లాంటి గొప్ప దర్శకుడే ఈ కొత్త దర్శకుడిని అంతలా ఎక్కిస్తున్నాడంటే మనోడిలో బాగానే టాలెంట్ ఉంది ఉంటుంది. సో ఎంత టాలెంట్ ఉంది అది ఎలా ఉపయోగపడుతుంది అన్నది సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం. ఇక ఈ సినిమాతోనైనా నవీన్ సగటు ప్రేక్షకుడి దృష్టిలో పడాలని ఆశిస్తుంది ఎపిహెరాల్డ్.కామ్. అజయ్ డైరక్షన్ లో నవీన్ చంద్ర హిట్ కొడతాడా..?        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: