పెద్ద సినిమాలు కూడా చిన్న స్క్రీన్లోనే చూడాలా..?
చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీ బాట పట్టాయి. ఇక ఇంతకు ముందు మేము ఓటీటీలలో రిలీజ్ చేయం అనుకన్ను సినిమాలు కూడా ఇప్పుడు దారికి వస్తున్నాయి. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల యూనిట్ల మధ్య డిస్కర్షన్ నడుస్తుంది. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నా.. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు.. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో.. నిర్మాతలు కూడా చాలా మంది ఓటీటీల వైపు చూస్తున్నారు. కొత్త కొత్త ప్యాకేజిలతో.. కొత్త కాన్సెప్ట్ లతో బాగా ఎట్రాక్ట్స్ చేస్తున్నాయి డిజిటల్ యాప్స్. ఇక ఇంటిల్లిపాది కలిసి తక్కువ ఖర్చుతో ఎక్కువ సినిమాలు... ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే అవకాశం ఉండటంతో... జనాలు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దాంతో కొత్త సినిమాలకు కూడా మంచి రేటుకు కోని వెబ్ రిలీజ్ చేయాలనేది ఓటీటీల ఆలోచన. దాంతో ఇప్పుడు రిలీజ్ కు ఉన్న చాలా సినిమాలకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి డిజిటల్ ప్లాట్ ఫామ్స్.
ఆల్ రెడీ చిన్న బడ్జెట్ సినిమాలు కొన్ని ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక తమిళం నుంచి సూర్య నిర్మించిన సినిమాతో పాటు... బాలీవుడ్ లో 83 మూవీతో పాటు అమితాబ్, ఆయుష్మాన్ గులాబో.. సితాబో కూడా వెబ్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. మొన్న మొన్నటి వరకు మాకు అలాంటి ఉధ్ధేశ్యం లేదు అన్న ఉప్పెన, అరణ్య లాంటి సినిమాలు కూడా ఇప్పుడు వెబ్ రిలీజ్ వైపు చూస్తున్నాయి. అనుష్క నిశ్శబ్ధం కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. అందుకే పెద్ద సినిమాలు కూడ చిన్నస్క్రీన్ లోనే చూడాల్సొస్తుందే మో అని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.