మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న ప్రణీత..!

Suma Kallamadi

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ప్రణీత ప్రస్తుతం పేదలకు ఎంతో అండగా నిలుస్తోంది. భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగానే కొంత మొత్తంలో డబ్బులు విరాళంగా ఇచ్చిన ఆమె తర్వాత పేద ప్రజలకు స్వయంగా తనే వంట చేసి పంపిణీ చేసింది. ఇప్పటికే లక్షల మందికి ఆహారపదార్థాలను అందజేసిన ప్రణీత తన సేవలను ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి ఒక్కరి మనసులో గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. తాజాగా ప్రణీత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. 


ఈ వీడియోలో నటీమణి ప్రణీత వంద మందికి పైగా ఆటోడ్రైవర్లకు హ్యాండ్ శానిటైజర్ లు ఇవ్వడంతో పాటు డ్రైవర్ సీట్ కి, ప్రయాణికుల సీట్లకు మధ్య ఓ పారదర్శకమైన కవరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె ప్రతి ఒక్కరికి అక్కడున్న ప్రతి ఒక్కరికీ చాలా చక్కగా వివరించారు. వీడియో చివర్ లో తాను ఒక ఆటోలో ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈమె చేసిన సేవకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. అలాగే తాను ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపింది. 

ఇకపోతే సెలబ్రిటీలలో ఇంటికే పరిమితం అయి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. బాలీవుడ్ బామ దిశా పటాని ఒక అద్భుతమైన పాటకు డాన్స్ చేసి అందరినీ తన ఫిజిక్ తో ఫిదా చేసేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో ఇంస్టాగ్రామ్ ఖాతాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె బీచ్ లో దిగిన ఒక ఫోటో తన అభిమానుల ఒంట్లో వేడి పుట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: