చిరంజీవిలో ఆ ప్రత్యేకతే ఆయన్ని మెగాస్టార్ ని చేసింది !!

Surya

జీవితం లో గొప్పగా ఎదగాలనుకునే వాళ్ళు ఎప్పుడునూ ప్రత్యేకంగా ఉంటారు. ఆకోవకు చెందినవారే నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వర రావు  మరియు కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. ఎన్ టీ రామారావు గారు కి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఇతర వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారిని మీరు అని సంబోధించే వారు అదేవిధంగా చిరంజీవిలో ఉన్న గొప్ప లక్షణం కూడా అదే చిరంజీవిగారు ఇతర వ్యక్తులను సైతం మీరు అని అంటూ గౌరవిస్తారు వారితో గౌరవ పూర్వకంగా మెలుగుతారు. నటనలలో ఆయనది ప్రత్యేక స్టైల్ .

 

అదేవిధంగా డాన్స్ లో కూడా ఆయనది  ప్రత్యేక స్టైల్ మరియు డాన్స్ స్టెప్ ఫినిషింగ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. తెలుగు సినీ చరిత్రలో డాన్స్ కోసం ప్రాణం పెట్టె వారిలో అయన ఒకరు. అయన చెవికి మ్యూజిక్ వినపడితే అయన ఒంట్లో ఎక్కడలేని పూనకం వచ్చేస్తుంది.

 

 

 

అప్పట్లో ఆయనకు సమానంగా డాన్స్ చేసేవారు చాలా తక్కువ అంటే అతిశయోక్తి కాదేమో. ఆయనను మ్యాచ్ చేయగలిగింది కేవలం రాధ , విజయ శాంతి , రంభ అని చెప్పుకోవచ్చు. చాలామంది అయన తోపాటు డాన్స్ ని అదరగొట్టినప్పటికీ వీరు మాత్రమే చెప్పుకోదగిన వారు.

 

 

 

 

ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరం వచ్చిన  ముందుగా చిరంజీవి తన ఆపన్న హస్తాన్ని అందిస్తారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉండబట్టే అయన గొప్ప వ్యక్తి గా ఎదిగారు ...అదేవిధంగా చాలామంది ఆయనను రోల్ మోడల్ గా తీసుకోని సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో ...

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: