పెళ్ళై పిల్లలున్న స్టార్ హీరోతో ఇలియానా ఎఫైర్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
గోవా బ్యూటీ ఇలియానా.. దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటి.. మహేష్ హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఇక ఆ తర్వాత వరుస విజయాలతో.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే కొన్నాళ్ల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా చక్కం తిప్పినా.. కొత్త భామలు రావడంతో.. ఈమెను పక్కన పెట్టేశారు. దాంతో ఈ గోవా బ్యూటీ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ మకం మార్చింది.
అక్కడ మొదట ఇలియానాకు నటనకు అవకాశాలున్న పాత్రలే దక్కాయి. కానీ, ఇలియానా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో.. అక్కడ కూడా ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక గతేడాది రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చినా.. ఇలియానా ఫేట్ మారలేదు. దీంతో అర కొర అవకాశాలు మాత్రమే అందుకుంటున్న ఇలియానా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులకు తెరలేపింది. అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడమే కాక మ్యాగజైన్ ఫోటోషూట్స్ కోసం బికినీలో సైతం దర్శనమిచ్చింది.
అయితే ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వీరిద్దరూ చాలా కాలం పాటు సహజీవనం కూడా చేశారు. దీంతో వీళ్లిద్దరు త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇలియానా తన బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న బంధానికి బ్రేకప్ చెప్పేసింది. ఇక బ్రేకప్ తర్వాత ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉండక..అవకాశాల కోసం దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతోంది. అయితే ఇలాంటి టైమ్‌లో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
ఇలియానా డిప్రెషన్ లో ఉన్న టైమ్‌లో బాలీవుడ్ అందాల తార కాజోల్ భర్త, స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆమెకు అండగా నిలిచాడంటూ టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వీరిమధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని.. ఇప్పుడాఫ్రెండ్ షిప్ కాస్తా వేరే రిలేషన్ వరకూ వెళ్లిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్ళై పిల్లలు ఉన్న అజయ్ దేవగన్ తో ఇలియానా రిలేషన్ షిప్ అంటూ ప్రస్తుతం టాక్ బయటకు రావడంతో.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇవి రూమర్సే అంటూ కొట్టిపాడేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది కాలమే చెప్పాలి.