తాకట్టులో భారతదేశం పుస్తకం చదివి ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకున్న పవన్..!

Kothuru Ram Kumar

పవన్ కళ్యాణ్ యుక్తవయసులో తన తండ్రి అయిన కొణిదెల వెంకట్రావు తాకట్టులో భారతదేశం అనే పుస్తకాన్ని కొనిచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ పుస్తకాన్ని రెండు మూడుసార్లు కూలంకషంగా చదివి... ఎందుకు ఈ సమాజం ఇంత దౌర్భాగ్యం గా ఉంది? ఈ సమాజం ఎటుపోతోంది? అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది? అనే ఆలోచనలతో సతమతమవుతూ తన జీవితాన్ని గడిపేవాడు. అయితే ఒకానొక రోజు సమాజం గురించి తన ఆలోచనలు మితిమీరడంతో తాను ఒక గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకున్నాడట.

అయితే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోబోతున్న అని తెలిసిన చిరంజీవి వెంటనే అప్రమత్తమై... పవన్ కళ్యాణ్ కి ఓ మంచి సైక్రియాటిస్ట్ వద్ద కౌన్సెలింగ్ ఇప్పించాడు. ఆలోచనల నుండి బయటపడేందుకు ఏదో ఒక కళలో నిమగ్నమవ్వాలని పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకోవడం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే తాను ఎన్నో మార్షల్ ఆర్ట్స్ విద్యలలో నైపుణ్యుడయ్యాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. అందుకే తాను నటించిన సినిమాల్లో ఫైవ్ చాలా సహజంగా అనిపిస్తాయి. తమ్ముడు సినిమా లో నిజంగానే తాను కారు కింద చేతులు పెట్టాడు అని మా అందరికీ తెలిసిన విషయమే. 


ఇకపోతే పవన్ కళ్యాణ్ లెక్కలేనన్ని ప్రజలకు ఆర్థిక సాయం చేశారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ని స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సంస్థ కి మా మొత్తం ఆస్తిని ఇచ్చి ఇంత మంది ప్రజలకు అండగా నిలిచాడు. ఎన్ని సహాయాలు చేసినా తన కుడి చేత్తో చేసే ఎడమ చేతికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు... చాలా కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నప్పుడు... పవన్ కళ్యాణ్ అవన్నీ వదిలిపెట్టి ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని రాజకీయ రంగంలో అడుగు పెట్టి అందరిని ఎంతో ఆశ్చర్యపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: