రెచ్చిపోయేందుకు రెడీ.. రకుల్ హింట్ మీకు అర్ధమవుతుందా..!

shami

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇక్కడ కెరియర్ ఆశాజనకంగా లేదని ముంబై చెక్కేసింది. తెలుగులో టాప్ స్టార్స్ తో కలిసి జతకట్టిన ఈ అమ్మడు మన్మధుడు 2 తర్వాత ఛాన్స్ అందుకోవడంలో వెనుకపడ్డది. మళ్ళీ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ తన అందచందాలతో ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. మాములుగా సినిమాలు చేస్తూనే రెచ్చిపోయే రేంజ్ లో ఫోటో షూట్స్ చేసే రకుల్ లేటెస్ట్ గా ఒకప్పటి హాట్ పిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 

అది ఇప్పటిది కాకపోయినా రకుల్ ఆ పిక్ షేర్ చేసింది అంటే ఇక మీద రెచ్చిపోయేందుకు రెడీ అని చెప్పకనే చెబుతుందని అంటున్నారు. తెలుగులో ప్రస్తుతం నితిన్ సరసన ఒక సినిమా ఛాన్స్ అందుకున్న రకుల్ ఆ సినిమాతో ఎలాగైనా మళ్ళీ ఇక్కడ వరుస ఛాన్సులు పట్టేయాలని చూస్తుంది. భీష్మ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినా నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 

 

ఈ సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. చెక్ టైటిల్ పరిశీలణలో ఉన్న ఈ సినిమాలో రకుల్ అదరగొట్టేస్తుందని తెలుస్తుంది. కాన్సెప్ట్ మూవీస్ తీయడంతో తన తర్వాతే ఎవరైనా అనేలా ప్రూవ్ చేసుకున్న చంద్రశేఖర్ యేలేటి నితిన్ తో మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ముందు చందరంగం అనుకున్న ఈ సినిమా టైటిల్ చెక్ గా మార్చినట్టు తెలుస్తుంది. నితిన్ తో రకుల్ మొదటిసారి జోడీ కడుతున్న ఈ సినిమాతో అమ్మడు తెలుగులో మళ్ళీ కెరియర్ సెట్ రైట్ చేసుకోవాలని చూస్తుంది. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Colour is everything, black and white is more 😉

A post shared by {{RelevantDataTitle}}