చిరంజీవి, మోహన్ బాబుల మధ్య మాటల యుద్ధం ఎలా కొనసాగిందో తెలుసా..?

Suma Kallamadi

తెలుగు ఇండస్ట్రీలో బడా నటులు వేరు వేరు రాజకీయ పార్టీలలో ఆరంగేట్రం చేసి ఒకరికొకరు శత్రువులుగా మిగిలిపోతున్నారు. వీరి మధ్య మాటల యుద్ధాలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు కారణంగా నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం చేసే విషయంలో మోహన్ బాబు, చిరంజీవి తగాదా పెట్టుకున్నారు. 


ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విమర్శలు చేయడంతో వారి మధ్య కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం కొనసాగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పాల్గొన్న మోహన్ బాబు ఎమ్మెల్యే ఎలా ఉండాలో తెలియాలంటే నేను తీసిన అసెంబ్లీ రౌడీ సినిమా చూడు అని చిరంజీవికి హితబోధ చేశారు. నేను ఎవరికీ భయపడను ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్పేస్తా. ఆరోగ్యంగా ఉండి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సహాయం చేయడానికి చర్చలు జరుపుతున్నా రాకపోవడం బాధాకరం అలాంటి(చిరంజీవి మా అసోసియేషన్ లో పాల్గొనలేదు) వారిని క్షమించకూడదు', అని మోహన్ బాబు చిరంజీవి పై విరుచుకు పడ్డాడు. 


మోహన్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి... 'మోహన్ బాబు నా గురించి మాట్లాడారు. మోహన్ బాబు రజనీకాంత్ అమరేష్ ఎప్పుడొచ్చినా మేమందరం కలుస్తూనే ఉంటాము. కానీ మోహన్ బాబు తనని అవాయిడ్ చేసి మేము మాత్రమే కలుస్తాము అని చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటి సిమ్మింగ్ పూల్ ఎదురుగా కూర్చొని ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. కన్నుల విందుగా ఉంది. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందని మోహన్ బాబు అంటుంటారు. నిజానికి మా మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు', అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: