స్కిన్ షో చేయకుండానే ప్రేక్షకులకు మత్తెక్కించిన భూమిక చావ్లా..!
తెలుగు పరిశ్రమలో దాదాపు అందరి హీరోల సరసన నటించిన భూమికా చావ్లా ఇప్పటివరకు ఎటువంటి గొడవల్లో తలదూర్చి లేదు. ఆమెపై ఇంతవరకు ఎటువంటి తప్పుడు ప్రచారం జరగడం లేదంటే అతిశయోక్తి. తన పనేదో తను చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న భూమిక చావ్లా అందాల ఆరబోతకు కూడా చాలా దూరంగా ఉంటుంది. ఎంత పాపులారిటీ వచ్చినా గొప్పల కి పోదు. సాధారణ వ్యక్తి లాగానే చాలా వినయం గా ఉండటం భూమిక చావ్లా యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. తమిళంలో విజయ్ దళపతి పక్కన ఖుషి సినిమాలో నటించి అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాలో భూమిక చావ్లా నడుము గురించి ఒక సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉందంటే అతిశయోక్తి కాదు. నువ్వు నా నడుము చూసావు అని భూమిక చెప్పే డైలాగ్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో బాగా హిట్ అయింది. నిజానికి భూమిక చావ్లా కింగ్ చేయడానికి అంతగా ఇష్టపడదు.
యువకుడు సినిమా తర్వాత ఖుషి సినిమాలో నటించిన భూమిక చావ్లా ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది. ఆమెకు బాలీవుడ్లో కూడా అవకాశాలు ఎన్నో రావడంతో సల్మాన్ ఖాన్ తో కలిసి తేరే నామ్ సినిమాలో నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో విభిన్నమైన పాత్రలో అద్భుతంగా నటించి వావ్ అనిపించింది. అయితే ఆమె దాదాపు 50 సినిమాలో నటించినప్పటికీ... స్కిన్ షో చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. సాంప్రదాయకమైన చుడీదార్ చీరలు మాత్రమే తరించి తన అందచందాలతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. వయసులో ఉన్నప్పుడు స్కిన్షో చేయడానికి ఇష్టపడే లేదు కానీ 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత అనగా ఇప్పుడు తన స్కిన్ బాగా షో చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.