స్టార్ హీరోలతో స్టెప్పులేసిన.. స్టార్ ఇమేజ్ రావడం లేదే..!

NAGARJUNA NAKKA

హీరోయిన్లు గ్లామర్ గా కనిపిస్తే బోల్డన్ని ఆఫర్స్ వస్తాయి. కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని చెబుతారు. కానీ టాలీవుడ్ లో చాలామంది బ్యూటీస్ మాత్రం ఎంత బోల్డ్ గా కనిపించినా బిజీ కాలేకపోతున్నారు. గ్లామర్ డాల్ అనే ఇమేజ్ ఉన్నా.. స్టార్ రేసులో అడుగుపెట్టలేక పోతున్నారు. పైగా వాళ్ల కెరీర్ కష్టాల్లో పడుతోంది.

 

పవన్ కళ్యాణ్, అర్జున్ లాంటి టాప్ హీరోలతో స్టెప్పులేసినా టాప్ రేసులో చోటు దక్కించుకోలేకపోయింది అనూ ఇమ్మానుయేల్. వరుసగా అజ్ఞాతవాసి, నా పేరు సూర్య లాంటి సినిమాల్లో నటించిన అనూ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలు ఫ్లాప్ అయి అనూ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేశాయి. 

 

తెలుగు నాట వరుస ఫ్లాపులు పడటంతో తమిళనాడు వెళ్లింది అనూ ఇమ్మానుయేల్. అక్కడ శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమా చేసింది. కానీ  బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బోల్తాపడి.. అను ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో అక్కడా అవకాశాలు పెద్దగా రాలేదు. ఇక ఇప్పుడు అను ఇమ్మానుయేల్ డైరీలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటిస్తోన్న అల్లుడు అదుర్స్ తప్ప మరో మూవీ లేదు. 

 

నిశా కళ్లతో క్రేజీ ఫాలోయింగ్ తెచ్చుకుంది నిధి అగర్వాల్. గ్లామర్ లుక్స్ తో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే ఈ బ్యూటీకి ఇప్పుడు బ్యాడ్ ఫేస్ రన్ అవుతోంది. హాట్ బ్యూటీ అనే ఇమేజ్ ఉన్నా కెరీర్ లో మార్పులు రావడం లేదు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ వచ్చినా క్రేజీ ఆఫర్ లేవు. నిధి కాల్షీట్స్ కి డిమాండ్ మాత్రం పెరగడం లేదు. 

 

నిధి అగర్వాల్ అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ తో వరుస సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ఞు, సవ్యసాచి లో స్టెప్పులేసింది. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు నిధిని నిరాశపరిచాయి. ఈ ఫ్లాపుల ప్రభావంతో పడిపోయిన గ్రాఫ్ కు ఇస్మార్ట్ శంకర్ కూడా లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాడు. ఈమె చేతిలో ఇప్పుడు గల్లా అశోక్ సినిమా తప్ప మరో మూవీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: