టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కమెడియన్లు..

siri Madhukar

సినిమా అంటేనే నవరసాలు, నవరసాలలో ఒకటి హాస్యం.  సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ ఎలాంటి సినిమాల్లో అయినా కామెడీ అనేది తప్పకుండా ఉండాల్సిందే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు కొద్ది సమయం నవ్వించే ప్రయత్నం చేస్తారు ప్రతి దర్శక, నిర్మాతలు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది హాస్యనటులు ఉన్నారు..అయితే వీరిలో ఎవరూ ఎవరికీ పోటీ లేరని అంటారు.  ఇతర భాషల్లో కన్నా తెలుగు నాట హాస్యనటులు తమదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు.  అలనాటి రేలంగి, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, అంజి, రమణారావు,చలం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు.  ఆ తర్వాత జనరేషన్ లో బ్రహ్మానందం, సుధాకర్, సీనియర్ నరేష్.. ఆ తర్వాత మన హావాభావలలో ఒక్కరిని నవ్వించండం అంటే అది ఒక్క గోప్ప కళ, అలాంటి కళను సునయసనంగా చేస్తూ చాలా మందిని నవ్విస్తూ వారికి సంతోషాన్ని పంచుతున్న మన తెలుగు కామిడియన్స్ చాలమంది వారిలో ఇప్పుడు ఉత్తమమైన వారి గురించి తెలుసుకుందాం...

 

రాజబాబు : తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు హాస్యనటునిగా వెలిగిన రాజబాబు (అక్టోబరు 20, 1935 - ఫిబ్రవరి 14, 1983) "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి.  రాజ బాబు కి మొదటి సారి తెరపై కనిపించిన చిత్రం సమాజం. ఆ తరువాత వచ్చిన అంతస్తులు చిత్రానికి గాను మంచి గుర్తింపు లభించింది. ఈయన వరుసగా 7 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొన్న మొట్టమొదటి హాస్య నటుడు, తాత్విక ఆలోచనలు గలవాడు.

పద్మనాభం : ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. ఆయన తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 

సుత్తివేలు :  రెండు దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు సుత్తి వేలు కృష్ణా జిల్లాలోని విజయవాడ కి 70 కి. మీ. దూరంలో ఉన్న భోగిరెడ్డిపల్లి లో జన్మించినాడు. ‘ముద్ద మందారం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా కూడా ‘నాలుగుస్తంభాలాట' చిత్రంలో ఆయన పోషించిన సుత్తి పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.

బ్రహ్మానందం : తెలుగులో 900కి పైగా సినిమా ల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఘనత ఈ హాస్యనటుడికి దక్కుతుంది. ఒకే భాషలో అత్యధికంగా సిని మాలు చేసిన బ్రహ్మానందం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించడం విశేషం. నరేశ్ నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో హీరోకి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "అహ నా పెళ్ళంట". 

అలీ :

 సీతాకోక చిలుక చిత్రం ద్వారా బాల నటుడుగా పరిచయమైన అలీ , ఇప్పటి వరకు 800 పై చిలుకు చిత్రాలలో నటించాడు. ఇక ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, అలాగే పవన్ కల్యాణ్ తన ప్రతి చిత్రంలో ఆలీని పెట్టుకోవడం సెంటిమెంట్ గా పడిపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: