బాలు తో ఆ సింగర్ గొంతు కలిపాడు అంటే అదో అద్భుతమే..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత గాయకుడిగా ఎదిగిన ఎస్పీ బాలసుబ్రమణ్యం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వివిధ భాషలలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గానగంధర్వుడి గా... భారతదేశం గర్వించదగ్గ నేపథ్య గాయకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. ఇక ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులు. ఎన్నో ప్రశంసలు. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరం వింటే చాలు ప్రేక్షకులు మైమరిచి పోతుంటారు. అదేంటోగాని ఎస్పీ బాలసుబ్రమణ్యం స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంది ఆయన పాడిన పాటలు వింటున్నంత సేపు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది. 

 


 అయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక లెజండ్రీ నేపథ్య గాయకుడు అనే చెప్పాలి.. ఇలాంటి ఒక లెజండ్రీ నేపథ్య గాయకుడు మరో లెజెండరీ సింగర్ తో గొంతు కలిపి పాడితే ఇక సంగీత ప్రేమికులకు అంతకుమించిన బహుమతి ఏముంటుంది. ఇలా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంతోమంది లెజెండరీ సింగర్స్ తో తాను కూడా గొంతు కలిపి సినీ ప్రేక్షకులను సంగీత ప్రేమికులు మైమరిపింప  చేశారు. అయితే ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంతమంది లెజెండరీ సింగర్స్ తో గొంతు కలిపినప్పటికీ ఒక్క సింగర్ తో గొంతు కలిపి పాడిన పాటలు మాత్రం ఇప్పటికి  ఫేవరెట్గా నిలిచాయి .ఆ  సింగర్ ఎవరో కాదు... ఏసుదాసు. 

 


 భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నేపథ్యగాయకుడిగా ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఏసుదాసు. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో  పాటలు పాడిన విషయం తెలిసిందే. ఇద్దరిలోనూ స్వరం లో అదేదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఇక వీరిద్దరూ కలిసి పాడారు అంటే తెలుగు ప్రేక్షకులందరూ మైమరచిపోయి పులకరించి పోతూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరూ పాడిన పాటల్లో  సింగారాల పైరుల్లోన... బంగారాలే పండేనంట అంటూ సాగిపోయే ఒక పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ పాటలో  తెలుగుతనం ఉట్టిపడేలా... ఎంతో మధురం... ఎంతో అద్భుతమైన అర్థం... వినసొంపైన గానం తో నిండి ఉంటుంది ఈ పాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: