హాట్ లుక్స్‌తో మతిపోగొట్టేస్తున్న అను ఇమాన్యుయేల్..!!
అను ఇమాన్యుయేల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నాని హీరోగా వచ్చిన `మజ్ను` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. అను ఇమ్మానుయేల్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది.
ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `నా పేరు సూర్య` సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో.. అను ఇమాన్యుయేల్ ఖాతాలో వరుస ఫ్లాపులు పడ్డాయి. శైలజ రెడ్డి అల్లుడు కూడా ప్లాప్‌గా నిలిచింది. ఇక తమిళంలో ఆమె నటించిన తుప్పారివాలన్ తెలుగులో డిటెక్టివ్ గా వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
వాస్తవానికి అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్లు మాములుగా అంత వేగంగా తెరమరుగు ఎవరు. కానీ అందాల భామ అను ఇమాన్యుయేల్ కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో చేసినా.. కలిసి రాకపోవడంతో ఈ బ్యూటీని ఐరన్ లెగ్ ముద్ర వేసేసి పక్కన పెట్టేసారు.
ఈ నేపథ్యంలో ఈ చిన్నది వెబ్ సీరీస్ లలో రొమాంటిక్ పాత్రల్లో కూడా నటించాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నట్టు తెలుస్తోంది. అలాగే మరోవైపు హాట్ హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.