ఇప్పటికీ టాలీవుడ్ ని షేక్ చేసే నాగ్ వాన పాట

Gullapally Venkatesh

నాగార్జున కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ప్రేమ యుద్ధం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రధానంగా నాగార్జున నటనకు ఈ సినిమాలో పడిన మార్కులు ఆ సమయంలో మరే సినిమాలో కూడా పడలేదు. ముఖ్యంగా యూత్ కి అయితే ఈ సినిమా ఒక రేంజ్ లో నచ్చింది అని చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశం కూడా యువతను చాలా బాగా ఆకట్టుకుంది ఆ సినిమాలో అని చెప్పవచ్చు. నాగార్జున కెరీర్ మొదట్లో వచ్చిన ఈ సినిమాలో అతని నటనకు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. 

 

ఇప్పటికి కూడా ఆ సినిమా టీవీ లో వచ్చింది అంటే కచ్చితంగా చూసే పరిస్థితి ఉంటుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రధానంగా కథ కూడా సినిమాకు బలంగా మారడం తో యువత కు బాగా నచ్చింది అప్పట్లో అని అంటూ ఉంటారు. ఇక ఈ సినిమాలో ఉండే పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది అప్పట్లో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఉండే స్వాతి ముత్యపు జల్లులలో అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అమల నాగార్జున హీరో హీరోయిన్ లు గా నటించగా ఈ పాటలో అయితే ఇద్దరు కూడా రోమాన్స్ విషయంలో హద్దులు దాటిపోయారు అనే మాట కూడా అప్పట్లో వినపడింది. 

 

ఆ విధంగా ఆ పాటలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాకు ఆ పాటే ప్రధాన బలం అనేది చాలా మంది చెప్పే మాట. నిజం ఎలా ఉన్నా సరే ఆ పాట మాత్రం ఊపేసింది అప్పట్లో. ఎస్పీ బాలు ఆ పాటను పాడిన సంగతి తెలిసిందే. అందుకే ఆ పాట అలా ఉంది అంటారు ఆయనఅభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: