లాక్ డైన్ కారణంగా సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో తారలు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఫోటో షూట్లకు కూడా అవకాశాలు లేకపోవటంతో గతంలో తీయించుకున్న ఫోటోలనే తిరిగి షేర్ చేస్తున్నారు తారలు. దీంతో అభిమానులు కూడా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటు ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి ఓ ఫోటోనే షేర్ చేసింది హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. తొలి సినిమాలోనూ ఓ రేంజ్లో గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్‌తో సరిపెట్టుకుంది. అదే సమయంలో బాలీవుడ్‌లోనూ అవకాశాలు రావటంతో అక్కడ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
అంతేకాదు కన్నడ, మళయాల, బెంగాలీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే సినిమాల విషయంలో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రద్ధా. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంటోంది.
auto 12px; width: 50px;">
View this post on Instagram
🏝️💚 #gilitrawangan #reminiscing
A post shared by Shraddha Das (@shraddhadas43) on