ఆ రైటర్ చేతిలో నందమూరి వారసుడి భవిష్యత్తు..!

shami

నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్నాళ్లగానో ఎంట్రీకి ఎదురుచూస్తున్న హీరో నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. మోక్షజ్ఞ తెరంగేట్రం బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఉంటుందని అనుకోగా  అది సాధ్యపడేలా లేదు. క్రిష్ డైరక్షన్ లో మోక్షజ్ఞ సినిమా వస్తుందని అన్నారు అది  రూమరే అనే తేలింది. ఇక లేటెస్ట్ గా నందమూరి వారసుడి తెరంగేట్రం బాధ్యత ఓ స్టార్ రైటర్ చేతిలో పెట్టాడని ఫిల్మ్ టాక్. 

 

బాలకృష్ణ వారసుడు అనగానే నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు  చేసే పనిలో ఉన్నాడట టాలీవుడ్ స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా. క్రిష్ సినిమాలకు రైటర్ గా చేస్తూ వచ్చిన సాయి మాధవ్ బుర్ర అనతికాలంలోనే తన పెన్ పవర్ ఏంటో చూపించాడు.గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమా వరకు సాయి మాధవ్ బుర్ర రైటింగ్ టాలెంట్ ప్రేక్షకులను మెప్పించింది. 

 

ఇక కొన్నాళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కోసం సాయి మాధవ్ బుర్ర ఆ బాధ్యత తీసుకున్నాడట. మోక్షజ్ఞ ఎంట్రీ కథను రెడీ చేశాడట. అంతేకాదు ఈ సినిమాకు అతనే డైరక్షన్ కూడా చేస్తాడని తెలుస్తుంది. రైటర్ డైరక్టర్ గా మారడం అది కూడా స్టార్ హీరో తనయుడి సినిమాతో అది జరగడం చూస్తుంటే సాయి మాధవ్ బుర్ర భారీ స్కెచ్చే వేశాడని చెప్పొచ్చు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.                 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: