నీలాంబరి, శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణ శృంగార పాత్రల్లో కూడా నటించిందా..?
చాలా రోజుల వరకు వెండి తెరకు దూరమైనా రమ్యకృష్ణ సినీ అవకాశాల్లేక అల్లాడి పోయింది. శ్రీదేవి ప్రభాస్ తల్లిగా నటించేందుకు ఎవరూ భరించలేని మొత్తాన్ని తన పారితోషికంగా అడిగింది కానీ నిర్మాతలు మాత్రం అందుకు నిరాకరించి నువ్వు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనేసి రమ్యకృష్ణ సంప్రదించారు. రాజమౌళి సినిమా అనగానే తాను వెంటనే ఒప్పుకుంది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం... ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా పేరు రావడం చకచకా జరిగిపోయాయి. నిజానికి శివగామి పాత్ర లో రమ్యకృష్ణ ఒదిగిపోయినట్టు ఏ యాక్టర్ ఒదిగిపోలేకపోయేదేమో అన్నట్టు రమ్యకృష్ణ తన నటనతో వావ్ అనిపించింది. 1999వ సంవత్సరంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహ(తమిళంలో పడయప్పా) లో రజనీకాంత్ కి విలన్ గా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతం గా నటించి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా అశేషమైన కీర్తిని గడించింది.
ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ తన సినీ కెరీర్ లో వెనుతిరిగి తీసుకోలేదు. నిజానికి నరసింహ సినిమా లోని నీలాంబరి పాత్ర కూడా రమ్యకృష్ణ కి మొదటిగా ఇవ్వలేదు. నటీమణి మీనాని ఆ పాత్రలో నటింపజేయాలని కె ఎస్ రవికుమార్ అనుకున్నాడు కానీ చైనా చూడటానికి చాలా అమాయకంగా ఉందని ఆమె నెగెటివ్ రోల్ లో చేస్తే బాగుండదు అని భావించి రమ్యకృష్ణ ను ఎంపిక చేసుకున్నాడు. నరసింహ సినిమాలో నటించినందుకు గాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ ఫిలింఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు లభించాయి.
2019 వ సంవత్సరం లో తమిళంలో విడుదలైన సూపర్ డీలక్స్ సినిమాలు రమ్యకృష్ణ ఒక పోర్న్ స్టార్ గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులోనే ఒక సన్నివేశం కోసం ఆమె 37 టేకుల ను తీసుకొని సెట్స్ లోని వారందరినీ ఆశ్చర్యపరిచింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాలో కూడా రమ్యకృష్ణ సెక్సీ రోల్ లో నటించి ప్రేక్షకులకు మత్తెక్కించింది. నా అల్లుడు చిత్రంలో కూడా రమ్యకృష్ణ ఎన్టీఆర్ తో రొమాన్స్ బీభత్సంగా చేసేసింది.
1997 సంవత్సరంలో విడుదలైన దేవుడు చిత్రంలో రమ్యకృష్ణ బాలయ్య సరసన నటించింది. ఈ చిత్రంలో ఆమె విపరీతంగా రెచ్చి పోయింది అని చెప్పుకోవచ్చు. చిత్రంలో ఆమెకు బాలకృష్ణకు మధ్య కొనసాగిన కొన్ని సన్నివేశాలు చాలా సెక్సీ గా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబు, సత్య రాజ్( కట్టప్ప), నాగార్జున మోహన్ బాబు లాంటి హీరోల సరసన చాలా హాట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.