రమ్యకృష్ణ 'క్వీన్' అమ్మ బయోపిక్ కాదా?

Murali

బాహుబలి సిరీస్ సినిమాల్లో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రకు ఎంత పేరొచ్చిందో తెలిసిన విషయమే. రెండు దశాబ్దాల క్రితం నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు వచ్చిన పేరుకు పదింతల పేరు శివగామి పాత్రతో దక్కింది. శివగామి పాత్రతో వచ్చిన పేరుకు తగ్గట్టే ప్రస్తుతం రమ్యకృష్ణ తన పాత్రలు ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది 'క్వీన్' వెబ్ సీరీస్ లో నటించింది. స్వీయ నిర్మాణంలో గౌతమ్ మీనన్ మరో దర్శకుడు ప్రసత్ మురుగేసన్ తో కలిసి దర్శకత్వం వహించారు.

 

అయితే ఈ వెబ్ సీరీస్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాల్ని మేకర్స్ కొట్టిపారేశారు. నిజానికి జరిగింది కూడా అదే. ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. క్వీన్.. అనిత శివకుమారన్ రాసిన 'క్వీన్' అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోందని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. శక్తి శేషాద్రి అనే ఓ బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ తయారైందని చెప్పుకొచ్చాడు.

 

ఈ వెబ్ సిరీస్ కి అమ్మ జీవిత కథ కి ఏమాత్రం సంబంధం లేదని రమ్యకృష్ణ కూడా క్లారిటీ ఇచ్చింది. క్వీన్ రెండో సిరీస్ లో శక్తి శేషాద్రి పాత్ర రాజకీయ నాయకురాలిగా ఎదిగిన విధానాన్ని చూపిస్తారని సమాచారం. అయితే 'క్వీన్' వెబ్ సిరీస్ ఓటీటీ లోనే కాకుండా జూన్ 6 నుంచి జీ టీవీ లో కూడా టెలికాస్ట్ కాబోతుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. రమ్యకృష్ణ పాత్ర చాలా శక్తివంతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీల్లో వస్తున్న ట్రైలర్ లో కూడా రమ్యకృష్ణ మేకోవర్ ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: