ఎన్టీఆర్ జీవితంలోని ఆ సంఘటన పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja

మరో రెండు రోజులలో బాలకృష్ణ షష్టిపూర్తి జరగబోతోంది. ఈసందర్భంలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య పెరిగిపోతున్న తన వయసు పై కొన్ని వ్యాఖ్యలు చేసాడు. తనకు 60 ఏళ్ల వయసు వచ్చింది అని అనిపించుకోవడం చాల చికాకు అనీ తానెప్పుడు స్వీట్ సిక్స్ టీన్ అన్న భావనలోనే ఉంటాను అంటూ బాలయ్య పెరుగుతున్న తన వయసు పై అభిప్రాయ పడ్డాడు.


ఇదే సందర్భంలో ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధి బాలయ్యను ఒక ప్రశ్నతో ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితాన్ని పరిశీలించినప్పుడు ‘నాన్నగారు ఆ సందర్భంలో అలా చేసి ఉండాల్సింది కాదు’ అని అనిపించే ఘటన ఏమైనా ఉందా అంటూ పరోక్షంగా లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ వివాహ ప్రస్తావన తీసుకువచ్చాడు.


అయితే ఈప్రశ్నకు బాలయ్య చాలతెలివిగా సమాధానం చెప్పాడు. తన తండ్రి అప్పట్లో అలా చేస్తే బాగుంటుంది అని చెప్పే సమర్థత తనకు ఇప్పటికీ లేదనీ ఏవ్యక్తికైనా జీవితంలో జరగవలసిన నష్టం జరిగి తీరుతుంది అన్న వేదాంతం తనకు ఉంది అని చెపుతూ ప్రతివ్యక్తి జీవితంలోను మంచి చెడులు ఉంటాయని అదే విధి అంటూ కామెంట్స్ చేసాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయాలలో బాగా రాణిస్తారు ఆయనకు మంచి భవిష్యత్ ఉంటుంది అని స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ తనతో తన తండ్రి జీవించి ఉన్న రోజులలో చెప్పిన విషయాలను ఇప్పుడు బాలకృష్ణ గుర్తుకు చేసుకుంటున్నాడు.


ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ షూటింగ్ లు మొదలు కావడం గురించి మాట్లాడుతూ తాను కరోనాను లెక్క చేయకుండా 100 మందితో షూటింగ్ చేయడానికి రెడీ అని అంటూ తాను ముహూర్తం చూసుకుని ఇంటి నుండి షూటింగ్ కు బయలుదేరుతాను కాబట్టి తనను కరోనా ఏమిచేయలేదు అని బాలయ్య కరోనాకు సవాల్ విసురుతున్నాడు. అయితే ఇండస్ట్రీలో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో కరోనా ను లెక్కచేయకుండా షూటింగ్ లు మొదలుపెట్టడం ఎవరికీ శ్రేయస్కరం కాదు అంటూ షూటింగ్ లు మొదలు కావడానికి ధియేటర్లు తెరుచుకోవడానికి మరో నాలుగు నెలలు పట్టే ఆస్కారం ఉంది అని బాలయ్య అభిప్రాయపడుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: