ఇక అప్పటివరకు మహేష్ సినిమా మొదలవ్వదా ...?
సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి కానుకగా వచ్చిన సరి లేడు నీకెవ్వరు సినిమా అనంతరం... పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నట్లు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. అలాగే ఆ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి పరశురామ్ తాను ఎప్పుడూ తీయని విధంగా డిఫరెంట్ జోనర్ లో ఈ కథను సిద్ధం చేసుకుని మహేష్ బాబు ఇంప్రెస్ చేయడం జరిగింది..
అలాగే ఈ సినిమాను మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్ లో రూప దిద్దాలని ఆలోచిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే విషయం నిజమే అయితే మహేష్ బాబు హీరోగా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. అలాగే మహేష్ బాబు ఈ సినిమాలో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెల నుంచి మొదలు అవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే కరోనా వైరస్ తరుణంలో షూటింగ్ మొదలు పెట్టి తనతో పాటు చిత్ర యూనిట్ ను ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది. ఇకపోతే సినిమా షూటింగ్ డిసెంబర్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నడంతో... మహానటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక మొత్తానికి ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నెలలో మొదలవబోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ ప్రారంభించి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటమే మంచిది అంటూ మహేష్ తన సన్నిహితుల వద్ద మాట్లాడినట్లు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్ లో చిత్రయూనిట్ ఉన్నట్లు సమాచారం.